Diwali 2022: స్మశానవాటికలో దీపావళి వేడుకలు.. వింత సందడి ఎక్కడ..? ఎందుకో తెలుసా?..

పండుగకు వారం రోజుల ముందు శ్మశానవాటికను శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు. కుటుంబ సభ్యులందరూ సమాధుల వద్దకు వెళ్లి పూలతో సమాధులను అలంకరించారు. పండుగ రోజు కుటుంబ సభ్యులంతా సాయంత్రం అక్కడే గడుపుతారు.

Diwali 2022: స్మశానవాటికలో దీపావళి వేడుకలు.. వింత సందడి ఎక్కడ..? ఎందుకో తెలుసా?..
01. Diwali Celebration In T
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 25, 2022 | 5:34 PM

దీపావళి వేడుకలను ప్రజలంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పర్వదినం వేళ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఏ ఇల్లు చూసినా దీపాలు, విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించి సంబరాలు చేసుకుంటారు. అయితే, అందరి జీవితాల్లో చీకట్లను తొలగించి ఆనందాల వెలుగులు నింపాలని దీపావళి పండుగ జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించడం, పటాకులు కాల్చడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, తెలంగాణలోని ఓ జిల్లాలో మాత్రం ఇది పూర్తిగా విరుద్ధం. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన ఆచారం ఉంది. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఆరు దశాబ్దాల నుంచి శ్మశాన వాటికలో దీపావళి జరుపుకునే ఆనవాయితీ ఉంది. పూర్వీకులను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులను సమాధి చేసిన ప్రదేశంలో దీపాలు వెలిగించి వేడుక చేసుకోవటం ఒక ఆచారంగా నిర్వహిస్తారు.

ఈ ఆచారం తెలంగాణలోని కరీంనగర్‌లో కొనసాగుతోంది. కరీంనగర్‌లోని కర్జన గడ్డ వద్ద గల హిందూ శ్మశాన వాటికలో ప్రతి సంవత్సరం దళిత కుటుంబాలు స్మశాన వాటికలో చనిపోయిన తమ బంధువుల సమాధుల వద్ద దీపావళి పండుగ జరుపుకుంటారు. పండుగకు వారం రోజుల ముందు శ్మశానవాటికను శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు. కుటుంబ సభ్యులందరూ సమాధుల వద్దకు వెళ్లి పూలతో సమాధులను అలంకరించారు. పండుగ రోజు కుటుంబ సభ్యులంతా సాయంత్రం అక్కడే గడుపుతారు. అక్కడ దీపావళి జరుపుకుంటారు. నైవేద్యాలు పెట్టి తమ పెద్దలను స్మరించుకుంటారు.

తమ పూర్వీకుల సమాధుల వద్ద కొవ్వొత్తులు వెలిగించి, వారికిష్టమైన పిండివంటలు పెట్టి, అక్కడె టపాసులు కాలుస్తూ అర్ధరాత్రి వరకు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఊరు ఊరంతా దీపావళి పండుగను ఊర్లో జరుపుకుంటే, వీరు మాత్రం స్మశానంలో జరుపుకుంటారు. దీపావళి రోజు ఇలా చేస్తే మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం. కొంచెం వింతగా అనిపించినా.. చనిపోయిన వారి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని పండుగ చేసుకోవడం ఆనందంగా ఉందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి