Hyderabad: భాగ్యనగరంలోని దీపావళి వేడుకల్లో అపశృతి.. 30 మందికి గాయాలు.. ఐదుగురి పరిస్థితి విషమం

నగరంలో జరిగిన దీపావళి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. పలుచోట్ల పటాకులు కాల్చేటప్పుడు జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో బాధితులు కంటి సమస్యలతో బాధపడుతూ మెహదీపట్నంలోని..

Hyderabad: భాగ్యనగరంలోని దీపావళి వేడుకల్లో అపశృతి.. 30 మందికి గాయాలు.. ఐదుగురి పరిస్థితి విషమం
Sarojini Eye Hospital Herab
Follow us
Surya Kala

|

Updated on: Oct 25, 2022 | 7:03 AM

హైదరాబాద్ దీపావళి వేడుకులు ఘనంగా జరిగాయి. అయితే నగరంలో జరిగిన వేడుకల్లో పలు చోట్ల విషాదం నింపింది. దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. టపాసుల మోతతో సందడి సందడిగా ఉంటుంది. చిన్నా, పెద్ద ఇలా ఇంటిల్లిపాది కలిసి పటాకులు కాల్చుతూ దీపావళిని సెలబ్రేట్‌ చేసుకుంటారు. అయితే, టపాసులు కాల్చే సమయంలో నిర్లక్ష్యంగా ఉండడంతో అపశృతి జరుగుతోంది. బాణాసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆస్పత్రి పాలవుతున్నారు.

నగరంలో జరిగిన దీపావళి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. పలుచోట్ల పటాకులు కాల్చేటప్పుడు జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో బాధితులు కంటి సమస్యలతో బాధపడుతూ మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారని సమాచారం.

సరోజినీ దేవీ కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు. మొత్తం 30 మంది గాయపడ్డారని వారికి చికిత్స అందించినట్లు సరోజినీ దేవీ కంటి ఆసుపత్రి వైద్యురాలు వసంత తెలిపారు. 12 మంది ప్రమాద బాధితులను సరోజినీ దేవీ కంటి ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసుకున్నట్లు చెప్పారు. ఇంకా ఎక్కువ కేసులు వచ్చినా సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రమాద బాధితుల్లో 5 మందికి సీరియస్ గా ఉందన్నారు. అందులో ముగ్గురిని వేరే ఆసుపత్రికి రిఫర్ చేశామన్నారు. గాయపడ్డ వారిలో చిన్న పిల్లలే అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు ఉస్మానియా గాంధీ హాస్పిటల్ లో కూడా 20 మంది వరకు గాయపడి వచ్చారు వాళ్లకి ట్రీట్మెంట్ చేసి పంపినట్టు వైద్యులు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి

దీపావళి పండుగను పురస్కరించుకొని ముందస్తు చర్యలు చేపట్టామని సరోజిని దేవి సివిల్ సర్జన్ నజఫీ బేగం తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా అదనపు వైద్యులు, సిబ్బందిని పెట్టినట్లు తెలిపారు.

Reporter: Noor, Tv9 Telugu

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..