AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode Bypoll: వార్‌ వన్‌ సైడ్‌.. మునుగోడులో గెలిచేది నేనే.. సినిమా డైలాగులతో కేఏపాల్ ప్రచార హోరు

మునుగోడులో ఒక్కో మండలానికి ఒక్కో కాలేజీ, ఉచిత ఆస్పత్రి, ప్రతి మండలానికి 1000 ఉద్యోగాలు ఇస్తానంటున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. 60 శాతం మంది ఓటర్లు ఇప్పటికే డిసైడ్ చేశారని తెలిపారు.

Munugode Bypoll: వార్‌ వన్‌ సైడ్‌.. మునుగోడులో గెలిచేది నేనే.. సినిమా డైలాగులతో కేఏపాల్ ప్రచార హోరు
Ka Paul
Follow us
Basha Shek

|

Updated on: Oct 25, 2022 | 7:07 AM

వార్ వన్ సైడ్ అయింది. మునుగోడులో గెలిచేది నేనే అంటున్నారు కేఏ పాల్. మునుగోడులో ఆయన జోరు.. డైలాగులు వింటే వారెవ్వా అనాల్సిందే. ఓసారి మీరూ చూడండి. 60 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని కేవలం 6 నెలల్లో చేసి చూపిస్తా.. మునుగోడులో ఒక్కో మండలానికి ఒక్కో కాలేజీ, ఉచిత ఆస్పత్రి, ప్రతి మండలానికి 1000 ఉద్యోగాలు ఇస్తానంటున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. 60 శాతం మంది ఓటర్లు ఇప్పటికే డిసైడ్ చేశారని తెలిపారు. ఇంకొంచెం కష్టపడితే ఆ మూడు పార్టీలకు డిపాజిట్లు కూడా రావంటున్నారు. మునుగోడు ఉపఎన్నిక దగ్గరపడే కొద్దీ పార్టీలన్నీ వేగం పెంచాయి. అభ్యర్ధులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అటు కేఏపాల్ సైతం తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నారు. తనదైన స్టైల్‌లో ప్రచారం నిర్వహిస్తూ సినిమా డైలాగులు పేలుస్తున్నారు కేఏ పాల్. మునుగోడులో కేఏ పాల్ ప్రచారం నిర్వహించారు. అక్కడ ఓ సెలూన్‌లో హెయిర్ కటింగ్ చేయించుకున్నారు. ఆ తర్వాత కొంత మంది ఓటర్లకు స్వీట్లు, వాటర్ బాటిళ్లు పంచారు. స్వయంగా చాయ్ పెట్టి ప్రజలకు పోశారు. అన్ని పార్టీల వల్ల ఒరిగేదేంలేదు. వార్ వన్ సైడ్ అయిపోయిందంటూన్నారు పాల్. మునుగోడు ప్రజలు తనవైపే ఉన్నారనీ.. ఇక తన గెలుపు ఖాయమని.. దాన్ని ఆపడం ఎవరి తరం కాదంటున్నారాయన.

కాగా ప్రజాశాంతి పార్టీకి గుర్తింపు లేకపోవడంతో మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేయనున్నారు కేఏపాల్‌. అయితే అందరిదీ ఒక దారైతే తనదొకదారి అంటూ ప్రచారంలో కొత్త పోకడను అవలంభిస్తున్నారు పాల్‌. ఇటీవల కేఏ పాల్ కు చెందిన రెండు ప్రచార వాహనాలు చండూరులో ప్రచార నిర్వహిస్తుండగా.. వాటి వెనకాలే వస్తున్న కేఏ పాల్ ను అధికారులు అడ్డుకున్నారు. దీంతో కేఏ పాల్ స్పందిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ నా ఫాలోవర్.. నేను పర్మిషన్ తీసుకునే ప్రచారం నిర్వహిస్తున్నా.. నేను తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రినీ రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ మండిపడ్డారు. సదరు అధికారినీ నీ పేరు ఏంటంటూ అధికారి మెడలోని గుర్తింపు కార్డు లాక్కుని పేరు చూసే ప్రయత్నం చేశారు. దీంతో పక్కనే ఉన్న అధికారులు పాల్ కు సర్ది చెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు మునుగోడును అమెరికా చేద్దామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..