AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bulldozer: రక్తానికి బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించిన ఆసుపత్రిపై చర్యలు.. రంగంలోకి బుల్డోజర్..

ఉత్తరప్రదేశ్‌లో నిర్లక్ష్యంగా రోగికి రక్తానికి బదులు బత్తాయి జూస్‌ ఎక్కించి మరణానికి కారణమైన హాస్పిటల్‌పై ప్రయోగరాజ్‌ మున్సిపల్‌ అధికారులు ఉక్కుపాదం మోపారు.

Bulldozer: రక్తానికి బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించిన ఆసుపత్రిపై చర్యలు.. రంగంలోకి బుల్డోజర్..
Prayagraj Hospital
Shaik Madar Saheb
|

Updated on: Oct 26, 2022 | 12:30 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో నిర్లక్ష్యంగా రోగికి రక్తానికి బదులు బత్తాయి జూస్‌ ఎక్కించి మరణానికి కారణమైన హాస్పిటల్‌పై ప్రయోగరాజ్‌ మున్సిపల్‌ అధికారులు ఉక్కుపాదం మోపారు. ప్రైవేటు ఆసుపత్రిని బోల్డోజర్‌తో కూల్చేసేందుకు రంగం సిద్ధమైంది. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే కాకుండా.. అనధికారికంగా ఆసుపత్రిని నిర్మించారని విచారణలో తెలింది. దీంతో శుక్రవారం వరకూ ఖాళీ చేయాలని ప్రయాగ్‌రాజ్ పురపాలక సంఘం అధికారులు.. ఆసుపత్రికి కూల్చివేత నోటీసు జారీ చేశారు. గ్లోబల్ హాస్పిటల్ అండ్ ట్రామా సెంటర్‌కు ప్రయాగ్‌రాజ్ పురపాలక సంఘం అధికారులు ఇచ్చిన కూల్చివేత నోటీసులో.. ఈ హాస్సిటల్‌ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మించారని, ఖాళీ చేయాలంటూ కొన్ని నెలల క్రితమే నోటీసులు ఇచ్చామని తెలిపింది. నోటీసులకు యాజమాన్యం స్పందించకపోవడంతో కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశామని ప్రయాగరాజ్‌ మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు.

35 ఏళ్ల డెంగ్యూ రోగి మృతి చెందిన తరువాత ప్రాథమిక దర్యాప్తులో..ఆ రోగికి బ్లడ్ ప్లేట్‌లెట్స్‌కు బదులుగా బత్తాయి జూస్‌ ఎక్కించారని, అందుకు ఆ ఆసుపత్రి అధికారుల అలసత్వం కారణమని వెల్లడైంది. దీంతో గత వారం ఈ ఆసుపత్రిని సీజ్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో రోగులు ఎవరే లేరని తెలిపారు.

మృతుని బంధువుల కథనం ప్రకారం… ‘ప్లాస్మా’ అనే లేబుల్ ఉన్న బ్యాగ్‌లో బత్తాయి రసాన్ని తీసుకొచ్చి, ఎక్కించారన్నారు. ఆరసాన్ని రోగికి ఎక్కించిన తర్వాత, ఆరోగ్యం మరింత క్షీణించిందని,తరువాత ఆయనను వేరొక ఆసుపత్రికి తరలించామన్నారు. అయినా ఫలితం లేకపోవడంతో చనిపోయాడని బంధువులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఆ బ్యాగులో ఉన్నది బత్తాయి రసమా? కాదా? అనే విషయాన్ని వెల్లడించే మెడికల్ రిపోర్టును ఇప్పటి వరకూ బయటపెట్టడం లేదు. ఇదిలా ఉంటే డెంగ్యూ రోగి మరణించిన మర్నాడే ప్రయాగ్‌రాజ్ పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించారు. నకిలీ ప్లేట్‌లెట్స్‌ను సరఫరా చేసే ముఠాను పట్టుకున్నారు. ఈ ఘటనలో పది మందిని అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్