అరె ఏంట్రా ఇది.. బస్సును ఆపావా.. సైకిల్ ను ఆపావా.. వీడియో చూస్తే పడీ పడీ నవ్వాల్సిందే..
ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చడంలో బస్సులు ముందు వరసలో ఉంటాయి. ప్రతి గ్రామానికి వెళ్తూ సేవలందిస్తుంటాయి. చెయ్యెత్తిన చోట ఆపుతూ.. అడిగిన చోట ఆపుతూ ప్రజలకు..

ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చడంలో బస్సులు ముందు వరసలో ఉంటాయి. ప్రతి గ్రామానికి వెళ్తూ సేవలందిస్తుంటాయి. చెయ్యెత్తిన చోట ఆపుతూ.. అడిగిన చోట ఆపుతూ ప్రజలకు దగ్గరయ్యాయి. మీలో చాలా మంది ఇలాంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బస్సుల్లో ప్రయాణించే ఉంటారు. దేశంలో దాదాపు ప్రతిచోటా బస్సు సౌకర్యం ఉంది. ఢిల్లీ, ముంబయియ, హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రజలు రాకపోకలు సాగించేందుకు మెట్రో తర్వాత బస్సులనే అధిక సంఖ్యలో వినియోగిస్తున్నారు. ప్రజలు ఎక్కడికైనా ప్రయాణించడానికి బస్సులు అత్యంత అనుకూలమైన, ఆర్థిక పరమైన మార్గం. ఢిల్లీలో బస్సులు సాధారణంగా బస్టాండ్‌లు ఉన్న చోట ఆగుతుంటాయి. గ్రామాలకు వెళ్లే బస్సులైతే దారి మధ్యలో చేయి ఎత్తి ఆపగానే ఆగుతాయి. ఇది అందరికీ అనుభవమే. అయితే కొంద మంది ఆకతాయిలు చేసే పనులు బస్సు డ్రైవర్లకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం బస్సుకు సంబంధించిన అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఓ యువకుడు రోడ్డు పక్కన నిలబడి ఉండటాన్ని చూడవచ్చు. అదే సమయంలో అక్కడికి ఓ బస్సు వస్తుంది. కానీ బస్సు అతని దగ్గర ఆగిన వెంటనే అతను బస్సు ఎక్కకుండా పక్క నుంచి వస్తున్న సైకిల్ ఎక్కుతాడు. వెంటనే ఆ ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఊహించని ఈ ఘటనకు బస్సు డ్రైవర్ అవాక్కవడాన్ని వీడియోలో చూడవచ్చు. అయితే సదరు యువకుడు ఎదురుగా వస్తున్న సైకిలిస్టుకి సిగ్నల్ ఇస్తున్నాడు. అయితే బస్సు డ్రైవర్ తనకు సిగ్నల్ ఇస్తున్నాడు అనుకుని అతని దగ్గరే ఆగాడు. అప్పుడు సైక్లిస్ట్ కూడా అతని వద్దకు చేరుకుంటాడు. ఆపై ఆ యువకుడు హాయిగా సైకిల్‌పై కూర్చొని వెళ్లిపోతాడు.




ऐसे मज़ाक कौन करता है भाई ?? pic.twitter.com/vXia5rrPwR
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) October 25, 2022
ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ‘అలాంటి జోకులు ఎవరు చేస్తారు బ్రదర్’ అని క్యాప్షన్ ఇచ్చారు. కేవలం 15 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 11 వేలకు పైగా వ్యూస్, వందలాది లైక్స్ వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..