Calcium Deficiency: ఎముకల ఆరోగ్యానికి వరం ఈ తృణ ధాన్యాలు.. రోజూ తింటే కాల్షియం లోపం ఇక దరిచేరదు..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Oct 25, 2022 | 1:57 PM

కాల్షియం మన శరీరానికి చాలా అవసరం. ఎముకలతో సహా దంతాల బలానికి ఇంకా పలు అవయవాలకు ఇది తప్పనిసరిగా అవసరం. కాల్షియం లోపం వల్ల రకరకాల వ్యాధులు సంక్రమిస్తాయి.

Calcium Deficiency: ఎముకల ఆరోగ్యానికి వరం ఈ తృణ ధాన్యాలు.. రోజూ తింటే కాల్షియం లోపం ఇక దరిచేరదు..
Seeds For Bone Health

కాల్షియం మన శరీరానికి చాలా అవసరం. ఎముకలతో సహా దంతాల బలానికి ఇంకా పలు అవయవాలకు ఇది తప్పనిసరిగా అవసరం. కాల్షియం లోపం వల్ల రకరకాల వ్యాధులు సంక్రమిస్తాయి. కాల్షియం లోపించడం వల్ల ముఖ్యంగా ఎముకలు బలహీనంగా మారుతాయి. దీనివల్ల కీళ్లు, నడుము నొప్పి సమస్య వస్తుంది. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు చాలా మంది క్యాల్షియం పౌడర్ తీసుకోవడం మొదలుపెడతారు. అయితే కొన్ని ఇంటి నివారణల సహాయంతో కాల్షియం లోపాన్ని సింపుల్‌గా అధిగమించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

కాల్షియంను మనం రోజువారీ ఆహారంలో చేర్చుకుని.. లోపాన్ని అధిగమించవచ్చు. మన శరీరానికి రోజుకు 1 వేల mg కాల్షియం అవసరం. ఇది రోజువారీ ఆహారం ద్వారా నెరవేరదు. కొన్ని రకాల పండ్లు, కూరగాయల సహాయంతో కాల్షియం అవసరాన్ని తీర్చుకోవచ్చు. కొన్ని రకాల పండ్లు, కూరగాయల విత్తనాలలో కాల్షియం మంచి పరిమాణంలో ఉంటుంది. ఈ గింజలను తీసుకోవడం ద్వారా కాల్షియం లోపాన్ని అధిగమించడంతోపాటు.. ఎముకలు దృఢంగా తయారవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. గసగసాలు: గసగసాలు కాల్షియానికి మంచి మూలం. మీరు ప్రతిరోజూ 1 టీస్పూన్ గసగసాలు తింటే.. కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు. గసగసాలు నేరుగా తినలేకపోతే.. వాటిని ఖీర్ లేదా లడ్డూలలో వేసి కూడా తినవచ్చు.
  2. చియా విత్తనాలు: చియా గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాల్షియం లోపం ఉన్నట్లయితే, ప్రతిరోజూ 1-2 టీస్పూన్ల చియా విత్తనాలను తినడం ద్వారా దాని లోపాన్ని అధిగమించవచ్చు. చియా గింజలలో పోషకాల సంపద దాగి ఉంది. కాల్షియం కాకుండా, ఇది మెగ్నీషియం, ఫాస్పరస్ కి మంచి మూలం.
  3. ఇవి కూడా చదవండి

  4. పొద్దుతిరుగుడు విత్తనాలు: పొద్దుతిరుగుడు విత్తనాలలో కాల్షియం గణనీయమైన మొత్తంలో కనిపిస్తుంది. కాల్షియం లోపం ఉన్నట్లయితే మీ రోజువారీ ఆహారంలో ఒక కప్పు పొద్దుతిరుగుడు గింజలను చేర్చుకోండి. పోషకాలు అధికంగా ఉండే పొద్దుతిరుగుడు విత్తనాలు దృఢమైన ఎముకలను నిర్మించడానికి అలాగే కండరాల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
  5. అవిసె గింజలు: అవిసె గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. రోజూ 1-2 స్పూన్ల అవిసె గింజలను తింటే, కాల్షియం లోపం తొలగిపోతుంది. అవిసె గింజలను నానబెట్టి లేదా ఫ్రై లాగా చేసుకుని తినవచ్చు.
  6. నువ్వు గింజలు: నువ్వుల్లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు దాగున్నాయి. నువ్వులు కాల్షియానికి మంచి మూలం. నువ్వులను లడ్డు లేదా మరే ఆహారంలోనైనా చేర్చుకోవచ్చు. దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే కాల్షియం లోపం సులభంగా తీరిపోతుంది.
  7. అమర్నాథ్ గింజలు: అమర్‌నాథ్ విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గింజలను తినడం వల్ల కాల్షియం లోపం తొలగిపోతుంది. రోజూ ఒక కప్పు అమర్నాథ్ గింజలు తింటే ఎముకల బలహీనత తొలగిపోతుంది. అలాగే ఇందులో ఉండే పోషకాలు రక్తకణాల సంఖ్యను పెంచడంలో సహకరిస్తాయి. ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu