Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dry Fruits: డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నారా…? జర జాగ్రత్త..!

పండుగల సమయంలో ఏ ఇంట్లో చూసిన స్వీట్లు, డ్రైఫ్రూట్సే ఎక్కువగా కనిపిస్తుంటాయి.. డ్రై ఫ్రూట్స్ అనేది పండుగ సమయంలో బహుమతి ఇచ్చుకునే ముఖ్యమైన ఆహార పదార్ధం. అతిథులకు అల్పాహారంగా కూడా ఇలాంటి డ్రైఫ్రూట్స్‌ని వడ్డిస్తుంటారు. డ్రైఫ్రూట్స్‌ చాలా ఆరోగ్యకరమైనవని అందరికీ తెలిసిందే. అయితే వీటితో గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి లింక్ చేశారు. కానీ మీరు ఎటువంటి పరిణామాలు లేకుండా వాటిని ఎక్కువగా తినవచ్చని దీని అర్థం కాదు. ఒక్కోసారి కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల […]

Dry Fruits: డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నారా…? జర జాగ్రత్త..!
Dryfruits
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 25, 2022 | 2:59 PM

పండుగల సమయంలో ఏ ఇంట్లో చూసిన స్వీట్లు, డ్రైఫ్రూట్సే ఎక్కువగా కనిపిస్తుంటాయి.. డ్రై ఫ్రూట్స్ అనేది పండుగ సమయంలో బహుమతి ఇచ్చుకునే ముఖ్యమైన ఆహార పదార్ధం. అతిథులకు అల్పాహారంగా కూడా ఇలాంటి డ్రైఫ్రూట్స్‌ని వడ్డిస్తుంటారు. డ్రైఫ్రూట్స్‌ చాలా ఆరోగ్యకరమైనవని అందరికీ తెలిసిందే. అయితే వీటితో గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి లింక్ చేశారు. కానీ మీరు ఎటువంటి పరిణామాలు లేకుండా వాటిని ఎక్కువగా తినవచ్చని దీని అర్థం కాదు. ఒక్కోసారి కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మీకు పెద్దగా హాని జరగదు. కానీ, మంచిది కదా అని మరీ అతిగా తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

బాదం, వాల్‌నట్‌లు, జీడిపప్పు, హాజెల్‌నట్‌లు,పిస్తాలు వంటి గింజలు వాటి ప్రయోజనకరమైన కొవ్వు, ప్రోటీన్ కంటెంట్‌ అధికంగా కలిగి ఉంటాయి. కొన్ని నట్స్‌తో సాధారణ లక్షణాలు కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అలాంటి నట్స్‌లో ఫైటేట్స్, టానిన్లు వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. నట్స్‌లో ఉండే కొవ్వు వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో డయేరియాకు దారి తీస్తుంది.

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నట్స్ ఒక గొప్ప స్నాక్‌గా పనిచేస్తుంది. ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ కారణంగా అతిగా తినకుండా ఉండటానికి ఇది మీకు సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఈ రెండూ చాలా అవసరం. కానీ ఈ స్నాక్స్ అధికంగా తినడం వల్ల అధిక కేలరీల ప్రభావంతో బరువు పెరగడానికి దారితీస్తుందని మీరు గుర్తుంచుకోవాలి. ఎండుద్రాక్ష వంటి చక్కెర కంటెంట్‌, కేలరీలను కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల చక్కెర స్థాయిలు అసమతుల్యతకు దారితీసి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల, డ్రై ఫ్రూట్స్‌ను ఎల్లప్పుడూ మితంగా తినడం చాలా ముఖ్యం. ఏ ఆహారం అయినా సరే మితిమీరిన వినియోగం ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది కాబట్టి కొన్ని రకాల నట్స్‌ని మితంగా తీసుకోవాలి. ఈ గింజలలో బ్రెజిల్ గింజలు, జాజికాయలు, బాదంపప్పులు ఉన్నాయి. బ్రెజిల్ గింజలను నమలడం వల్ల సెలీనియం ఎక్కువగా ఉంటుంది. అయితే బాదంపప్పులో హైడ్రోసియానిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శ్వాసకోశ సమస్యలు, ఊపిరాడకుండా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

నట్స్ తింటే కొందరిలో ఎలర్జీ సమస్యలు కనిపిస్తుంటాయి.. మొదటి సారి గింజలను ప్రయత్నించినప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే ఈ అలర్జీలు వేర్వేరు వ్యక్తులకు భిన్నంగా ఉంటాయి. మీరు గ్యాస్, ఉబ్బరం లేదా వికారం అనుభవిస్తే, మీకు నట్స్‌ పడటం లేదని గమనించాలి. వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది. కానీ నట్స్‌ని మితంగా తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందని గుర్తుంచుకోండి.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి