వామ్మో.. ఇదెక్కడి ధైర్యంరా అయ్యా.. భారీ మొసలిని లాలిస్తున్న వ్యక్తి.. వీడియో చూస్తే గూస్‏బంప్సే..

ఓ పెద్ద రాయిపై మొసలి ఎలా కూర్చుని నోరు విప్పిందో వీడియోలో చూడొచ్చు. అప్పుడు ఎదురుగా నిలబడిన వ్యక్తి తన నోటిలో చిన్న మాంసపు ముక్కను పెట్టాడు.. అది రెప్పపాటులో దాన్ని మింగేసింది.

వామ్మో.. ఇదెక్కడి ధైర్యంరా అయ్యా.. భారీ మొసలిని లాలిస్తున్న వ్యక్తి..  వీడియో చూస్తే గూస్‏బంప్సే..
Crocodile Video
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 24, 2022 | 5:05 PM

ప్రపంచంలో వేలాది జాతుల జంతువులు ఉన్నప్పటికీ అన్ని జంతువులు ప్రమాదకరమైనవి కావు. కొన్ని జంతువులు ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉంటాయి. కొన్ని జంతువులు చాలా ప్రమాదకరమైనవి. అలాంటి క్రూర జంతువులకు మనిషి కనిపిస్తే చాలు..చంపి తినేస్తాయి. వీటిలో సింహం, పులి, చిరుతపులి వంటి జంతువులు ఉన్నాయి. ఇది కాకుండా ప్రమాదకరమైన జంతువులలో మొసలి, ఎలిగేటర్ కూడా ప్రమాదకరమైనవే. మనుషులు మర్చిపోయి కూడా వాటి దగ్గరకు వెళ్లరు.. కానీ, ఇక్కడ మొసలికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు.

ప్రజలు సాధారణంగా మొసళ్ల దగ్గరకు పొరపాటున కూడా వెళ్లారు. కానీ, ఇక్కడ ఒక వ్యక్తి ఒక పెద్ద మొసలి ముందు నిలబడి దానిని ముద్దుగా చూస్తున్నాడు. ఓ పెద్ద రాయిపై మొసలి ఎలా కూర్చుని నోరు విప్పిందో వీడియోలో చూడొచ్చు. అప్పుడు ఎదురుగా నిలబడిన వ్యక్తి తన నోటిలో చిన్న మాంసపు ముక్కను పెట్టాడు.. అది రెప్పపాటులో దాన్ని మింగేసింది. దీని తరువాత మొసలి తన పెద్ద నోటిని మరింత పైకి లేపుతుంది. వ్యక్తి తన నోటిపై ప్రేమతో నుమురుతున్నాడు.. ఈ దృశ్యాన్ని చూస్తుంటే మొసలి తన పెంపుడు జంతువులా, ఆ వ్యక్తి దాని యజమానిలా అనిపిస్తోంది. ఈ వీడియో జూ నుండి వచ్చింది. ఆ వ్యక్తి బహుశా దాని సంరక్షకుడు కావచ్చు. అందుకే మొసలి అతనికి ఎటువంటి హాని చేయడం లేదు.

ఇవి కూడా చదవండి

వీడియో చూస్తుంటే ఒంటిపై రోమాలు నిక్కబొడిచేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఈ షాకింగ్‌ వీడియోను bilal.ahm4d అనే ID పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు, ఇది ఇప్పటివరకు 1 లక్షా 37 వేలకు పైగా వ్యూస్‌ని పొందింది. 5 వేల మందికి పైగా వీడియోను చూశారు. అలాగే లైక్ చేసారు. విడియో చూసిన ప్రతి ఒక్కరూ భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి