Car Accident: కారులో లిఫ్ట్ అడిగిన పాపానికి తల్లీకొడుకులు తిరిగి రాని లోకాలకు.. ప్రమాదంలో నలుగురు మృతి

కారులో లిఫ్ట్ అడిగిన పాపానికి తల్లీకొడుకులు జలసమాదయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో కారు అదుపుతప్పి వ్యవసాయబావిలో పడిన ఘటనలో మొత్తం నలుగురు మృతి..

Car Accident: కారులో లిఫ్ట్ అడిగిన పాపానికి తల్లీకొడుకులు తిరిగి రాని లోకాలకు.. ప్రమాదంలో నలుగురు మృతి
Car Accident
Follow us
Subhash Goud

|

Updated on: Oct 28, 2022 | 11:55 PM

కారులో లిఫ్ట్ అడిగిన పాపానికి తల్లీకొడుకులు జలసమాదయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో కారు అదుపుతప్పి వ్యవసాయబావిలో పడిన ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందగా వారిలో ఇద్దరు తల్లీ-కొడుకులు, మరో ఇద్దరు భార్యలు గా గుర్తించారు.. ఓ శుభకార్యంకు హాజరైన ఆ తల్లీ కొడుకులు తిరుగు ప్రయాణంలో కారులో లిఫ్ట్ అడిగి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముధ్రం మండలంలో జరిగింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామం నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి కి వెళ్తున్న కారు కేసముధ్రం వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడింది.

బావిలో పడిన కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. వారిలో భద్రు, అచ్చాలి, దీక్షిత్, సుమ, బిక్కు అనే కుటుంబసభ్యుల తో పాటు, లలితా-సురేష్ అనే తల్లికొడుకు ఉన్నారు. ఐదుగురు కుటుంబ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి శివారు గోల్యాతండా కు చెందిన వారు. తల్లీ కొడుకులు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వారు. వీరంతా అన్నారం గ్రామంలో విందుకు హాజరయ్యారు. దైవ దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు వెళ్తున్న ఈ కారు మహబూబాబాద్ మీదుగా వెళ్తుండడంతో లలితా- సురేష్ అనే తల్లీకొడుకులు లిఫ్ట్ అడిగి కారు ఎక్కారు. ఈ కారు కేసముధ్రం బైపాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే అదుపుతప్పి రహదారి పక్కనే వున్న బావిలో పడింది.

వెంటనే అప్రమత్తమైన దీక్షిత్, సుమ, డ్రైవర్ బిక్కు ప్రాణాలతో బయట పడ్డారు. వీరి తల్లిదండ్రులు భద్రు-అచ్చాలి అందులోనే జల సమాధి అయ్యారు. వీరితోపాటు లిఫ్ట్ అడిగి కారెక్కిన తల్లీకొడుకులు సురేష్ – లలితా కూడా అదే బావిలో ప్రాణాలు కోల్పోయారు. కారులో బావిలో పడుతున్న సమయంలో స్థానికులు గమనించి వారిని కాపాడే ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం దక్కలేదు. ఈ మృత్యుబావి నలుగురి ప్రాణాలు మింగేసింది. మూడు గంటల పాటు శ్రమించిన పోలీసులు, స్థానికులు డెడ్ బాడీస్ తో పాటు, కారును బయటకు తీశారు.

ఇవి కూడా చదవండి

నాలుగు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రోడ్డు పక్కనే వ్యవసాయ బావిని నిర్లక్ష్యంగా వదిలేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటున్న పోలీసులు. కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కూడా మద్యం సేవించి ఉన్నాడని భావిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు చాలా జరిగాయి. రోడ్డు పక్కన పొంచి ఉన్నబావులు అమాయకుల ప్రాణాలు మింగేస్తున్నాయి. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఎంతమంది బలవుతున్నా మార్పు రాకపోవడంతో ఆ నిర్లక్ష్యం ఖరీదు మరో నాలుగు ప్రాణాలయ్యాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ హీరో వల్లే నాకు పెళ్ళికాలేదు..
ఆ హీరో వల్లే నాకు పెళ్ళికాలేదు..
త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌: ప్రధాని మోదీ
త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌: ప్రధాని మోదీ
కొబ్బరి పువ్వు కనిపిస్తే లేట్ చేయకుండా తినండి..
కొబ్బరి పువ్వు కనిపిస్తే లేట్ చేయకుండా తినండి..
వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం.. అవి ఏమిటంటే..
వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం.. అవి ఏమిటంటే..
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..