Bombay High Court: తొమ్మిదేళ్ల బాలుడిపై ఎఫ్‌ఐఆర్.. పోలీసులను మందలించిన హైకోర్టు.. ప్రభుత్వానికి జరిమానా.. విషయం ఏమిటంటే..

సైకిల్ పై వెళ్తూ అనుకోకుండా ఓ మహిళలను ఢీకొట్టిన ఘటనలో 9ఏళ్ల బాలుడిపై కేసు నమోదు చేసి, ఎఫ్ ఐఆర్ ఫైల్ చేసిన ఘటనపై బాంబే హైకోర్టు పోలీసులను మందలించింది. అలాగే రూ.25 వేల జరిమానా విధించింది. బాలుడిపై..

Bombay High Court: తొమ్మిదేళ్ల బాలుడిపై ఎఫ్‌ఐఆర్.. పోలీసులను మందలించిన హైకోర్టు.. ప్రభుత్వానికి జరిమానా.. విషయం ఏమిటంటే..
Bombay Hc
Follow us

|

Updated on: Oct 28, 2022 | 1:30 PM

సైకిల్ పై వెళ్తూ అనుకోకుండా ఓ మహిళలను ఢీకొట్టిన ఘటనలో 9ఏళ్ల బాలుడిపై కేసు నమోదు చేసి, ఎఫ్ ఐఆర్ ఫైల్ చేసిన ఘటనపై బాంబే హైకోర్టు పోలీసులను మందలించింది. అలాగే రూ.25 వేల జరిమానా విధించింది. బాలుడిపై నమోదు చేసిన కేసును కొట్టివేసింది. సైకిల్‌పై వెళుతుండగా అనుకోకుండా ఓ మహిళను ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మహిళ పిర్యాదు మేరకు బాలుడిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 338 కింద కేసు నమోదు చేశారు. అయితే భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 83 కింద రక్షణ ఉన్నప్పటికీ బాలుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం వల్ల ఆ బాలుడికి తగిలిన గాయాలను పరిగణలోకి తీసుకోలేదని కేసును విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ ఎస్ఎమ్ మోదక్ ఈ కేసును కొట్టివేశారు. ఏడు నుంచి 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల విషయంలో ఇలాంటివి నేరాలు కాదని సెక్షన్ 83 నిర్దేశిస్తుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. పోలీసుల చర్య బాలుడి మనోభావాలను గాయపరిచిందన్నారు. ఐపీసీలోని సెక్షన్ 83 ఉన్నప్పటికీ, పిటిషనర్ కుమారుడైన 9 ఏళ్ల బాలుడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం సరైన చర్య కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది.

పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిసిస్తూ.. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని, బాలుడిది ఏమి తెలియని వయసు అని, మైనర్ పై నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ కొట్టివేయాలని కోరారు. ప్రమాద సమయంలో బాలుడికి కూడా గాయాలయ్యాయని, మీడియాలో వచ్చిన వీడియో ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందని న్యాయవాది న్యాయమూర్తుల ముందు చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తులు బాలుడిపై నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. న్యాయమూర్తుల తీర్పునకు ప్రభుత్వం తరపున న్యాయవాది, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం చెప్పలేదు. ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందని స్పష్టంగా గమనించిన కోర్టు, బాలుడి వయస్సును పరిగణలోకి తీసుకోకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం పట్ల విచారం వ్యక్తం చేసింది.

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సబ్-ఇన్‌స్పెక్టర్ చట్టంలో ఉన్న నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే అలా జరిగిందని, మైనర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ఉద్దేశం తమకు లేదని పోలీసులు పేర్కొన్నారు. అయితే వాద, ప్రతివాదాలు విన్న న్యాయస్థానం బాలుడిపై ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసి, పరిహారంగా పిటిషనర్‌కు రూ.25,000 చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధ్యులైన పోలీసు అధికారుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయవచ్చని కోర్టు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..