AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arvind Kejriwal: ప్రజలు అడుగుతున్నారు.. కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడు ఎక్కడ..? పీఎం మోడీకి కేజ్రీవాల్‌ లేఖ..

ఆమ్‌ఆద్మీ పార్టీ హిందూ ఆద్మీ పార్టీగా మారిందా.. అరవింద్ కేజ్రీవాల్ భక్త కేజ్రీవాల్‌గా ట్రాన్స్‌ఫామ్ అయ్యారా..? మోదీపై రిపీటెడ్‌గా ఎందుకు ఎటాక్ చేస్తున్నారు.. ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Arvind Kejriwal: ప్రజలు అడుగుతున్నారు.. కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడు ఎక్కడ..? పీఎం మోడీకి కేజ్రీవాల్‌ లేఖ..
Kejriwal Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Oct 29, 2022 | 6:35 AM

Share

ఆమ్‌ఆద్మీ పార్టీ హిందూ ఆద్మీ పార్టీగా మారిందా.. అరవింద్ కేజ్రీవాల్ భక్త కేజ్రీవాల్‌గా ట్రాన్స్‌ఫామ్ అయ్యారా..? మోదీపై రిపీటెడ్‌గా ఎందుకు ఎటాక్ చేస్తున్నారు.. ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి.. మరో లేఖ రాశారు. ఎన్నాళ్లిలా వెనకబడే ఉంటాం.. మన దేశం కూడా ముందుకెళ్లొద్దా? అంటూ ప్రధాని మోదీకి చురకేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. మన కరెన్సీ నోటుపై గాంధీ బొమ్మతో పాటు లక్ష్మీదేవి, వినాయకుడి చిత్రాలు కూడా ముద్రించాలన్న తన ప్రపోజల్‌ని మళ్లీ గుర్తు చేస్తూ మోదీకి బహిరంగ లేఖ రాశారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలు, ప్రజలు శ్రమిస్తేనే సరిపోదు.. దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలి అంటూ విచిత్రమైన లాజిక్ తీశారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి బద్ధశత్రువుగా పేరున్న కేజ్రీవాల్.. తరచూ మోడీ సర్కార్‌తో గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉన్నారు. లేటెస్ట్‌గా ఈ కరెన్సీ నోటు ఎపిసోడ్‌తో మోదీని కార్నర్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తన ఐడియాకు దేశం నలుమూలల నుంచి విపరీతమైన స్పందన వస్తోందని, వెంటనే అమలు చేయాలని మోదీని కోరారు కెజ్రీవాల్. ఇప్పటికే ఇండోనేషియాలో కరెన్సీ నోటుపై వినాయకుడి బొమ్మ ప్రింటైన విషయాన్ని గుర్తు చేశారు.

అటు.. అయోధ్య రామాలయంలోకే వెళ్లనన్న అపర నాస్తికుడు కేజ్రివాల్‌.. ఇప్పుడు అకస్మాత్తుగా పరమభక్తుడిగా ఎలా మారారు అంటూ బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ సడన్‌గా హిందూ ఆద్మీ పార్టీగా మారిందా? భక్త కేజ్రీవాల్‌కు అభివందనాలు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అభ్యుదయ భావాలతో పుట్టిన కెజ్రీవాల్ పార్టీ ఇలా హిందుత్వ టర్న్ తీసుకోవడంపై దేశవ్యాప్తంగా టాక్ నడుస్తోంది. సొంత పార్టీ క్యాడర్‌లో కూడా అంతర్మధనం మొదలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..