Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: గడ్డిపై చెప్పులు లేకుండా నడుస్తున్నారా? సర్వేలో షాకింగ్ విషయాలు చెప్పిన పరిశోధకులు..

పచ్చి గడ్డి మీద చెప్పులు లేకుండా నడవాలని చిన్నప్పటి నుంచి మన పెద్దలు చెబుతూనే ఉంటారు. పూర్వం ప్రజలు ఇలాగే నడిచేవారు. కానీ, ఆధునిక ఉరుకులు,

Health Tips: గడ్డిపై చెప్పులు లేకుండా నడుస్తున్నారా? సర్వేలో షాకింగ్ విషయాలు చెప్పిన పరిశోధకులు..
Barefoot On Grass
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 28, 2022 | 10:10 PM

పచ్చి గడ్డి మీద చెప్పులు లేకుండా నడవాలని చిన్నప్పటి నుంచి మన పెద్దలు చెబుతూనే ఉంటారు. పూర్వం ప్రజలు ఇలాగే నడిచేవారు. కానీ, ఆధునిక ఉరుకులు, పరుగుల జీవితంలో చాలా తక్కువ మంది మాత్రమే దీనిని పాటిస్తున్నారు. పచ్చటి గడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం అనేది ప్రకృతితో మనిషిని అనుసంధానించే సాంకేతిక ప్రకృతి వైద్యం. వాతావరణం, భూమితో ఎటువంటి సంబంధం లేని కారణంగానే నేటి ప్రజలు అత్యంత అధ్వాన్నమైన జీవనాన్ని సాగిస్తున్నారని జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ పబ్లిక్ హెల్త్‌లోని ఒక అధ్యయనం పేర్కొంది. మనుషులు భూమిలోని ఎలక్ట్రాన్‌లతో అనుసంధానించబడితే, వారి జీవితంలో అనేక మానసిక మార్పులు సంభవిస్తాయని అధ్యయనంలో పేర్కొన్నారు. ఇది వ్యక్తుల శ్రేయస్సును పెంచుతుంది.

చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు..

ప్రశాంతమైన నిద్ర: చెప్పులు లేకుండా గడ్డి మీద నడిస్తే రాత్రి ప్రశాంతమైన నిద్ర వస్తుంది. గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం నిద్ర మాత్రలా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయం అరగంట పాటు చెప్పులు లేకుండా నడిస్తే నిద్ర విధానంలో సానుకూల మార్పును తీసుకువస్తుందని హెల్త్‌షాట్ నివేదికలో పేర్కొన్నారు.

వాపు సమస్య తగ్గుతుంది: ఫ్రీ రాడికల్స్ మన కణాలలో నిండిపోవడం వల్ల వాపు సమస్య తలెత్తుతుంది. కణాలలో వాపు సమస్య అనేక వ్యాధులకు కారణం అవుతుంది. పచ్చటి గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీర భాగాలు చైతన్యవంతం అవుతాయి. వాపు సమస్య తగ్గుతుంది. అంతేకాదు.. బయట నడవడం వల్ల శరీరానికి సూర్యరశ్మి అందుతుంది. విటమిన్ డి శరీరానికి అందుతుంది.

ఇవి కూడా చదవండి

మానసిక ప్రశాంతత: ఉదయాన్నే నడవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని చాలా అధ్యయనాల్లో పేర్కొన్నారు. అయితే, చెప్పులు లేకుండా నడిస్తే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.

గుండె జబ్బులు నయం: ఉదయాన్నే పచ్చటి గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం గుండె ఆరోగ్యం మరింత మెరుగవడం. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు సమతుల్యంగా ఉంటుంది. దీని కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం బాగా తగ్గుతుంది.

కంటి చూపు మెరుగవుతుంది: పచ్చి గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల కంటి చూపు పెరుగుతుందని అధ్యయనం చెబుతోంది. పాదాల రెండవ, మూడవ చీలమండలపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ చీలమండలకు కళ్లకు ప్రత్యక్ష కనెక్షన్ ఉంటుంది. కావున, చెప్పులు లేకుండా నడవడం కళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..