Hair Care: జుట్టు తెల్లబడిపోయిందని విచారిస్తున్నారా? గుడ్ న్యూస్.. ఇలా చేస్తే నల్లగా మారిపోవడం ఖాయం..

సాధారణంగా, డ్రై ఫ్రూట్స్‌లో వాల్‌నట్స్‌కూ ఒకటి. వీటిని తినడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాలు అధికంగా ఉండే ఈ వాల్‌నట్స్ తినేందుకు..

Hair Care: జుట్టు తెల్లబడిపోయిందని విచారిస్తున్నారా? గుడ్ న్యూస్.. ఇలా చేస్తే నల్లగా మారిపోవడం ఖాయం..
Hair Care Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 28, 2022 | 7:19 PM

సాధారణంగా, డ్రై ఫ్రూట్స్‌లో వాల్‌నట్స్‌కూ ఒకటి. వీటిని తినడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాలు అధికంగా ఉండే ఈ వాల్‌నట్స్ తినేందుకు చాలా మంది ఇష్టపడుతారు కూడా. ఇవి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను ఇస్తుంది. జుట్టు సంరక్షణలో కూడా ఇది అద్భుత ఫలితాలనిస్తుంది. బాదం మాదిరిగానే వాల్‌నట్స్ కూడా జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయి. తెల్లబడిన జుట్టును సహజ మార్గంలో నల్లబడేలా చేస్తుంది.

అవును వాల్‌నట్స్ ద్వారా తెల్లబడిన జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది వాల్‌నట్ తొక్కలను పనికిరానివిగా భావించి పారేస్తారు. కానీ, వాల్‌నట్ పీల్స్ తెల్లజుట్టు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సమస్యను దూరం చేయడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. జుట్టు సంరక్షణలో వాల్‌నట్ తొక్కలను ఉపయోగించవచ్చునని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి వాల్‌నట్ పీల్స్‌తో తెల్ల జుట్టును నల్లగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వాల్‌నట్ పీల్స్‌తో స్ప్రే..

వాల్‌నట్ పీల్స్‌తో స్ప్రే ని తయారు చేసుకోవాలి. ఆ స్ప్రే ని రోజూ అప్లై చేయడం ద్వారా జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక పాన్‌ తీసుకోవాలి. అందులో కొన్ని శుభ్రమైన నీటిని పోయాలి. వేడి చేయాలి. 15 నిమిషాల పాటు నీరు మరిగిన తరువాత అందులో వాల్‌నట్ పీల్స్‌ను వేయాలి. 20 నిమిషాల పాటు ఆ నీటిని మరిగించాలి. దీనివల్ల వాల్‌నట్స్ పీల్స్‌లో ఉండే పోషకాలు నీటిలో తేలికగా కరిగిపోతాయి. ఇప్పుడు ఆ నీటిని చల్లారిన తరువాత ఫిల్టర్ చేసి స్ప్రే బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. ఆ స్ప్రేని రోజూ వినియోగించాలి.

ఇవి కూడా చదవండి

వాల్‌నట్‌తో హెయిర్ వాష్..

రాత్రి పడుకునే ముందు జుట్టుపై వాల్‌నట్స్ పీల్స్‌తో తయారు చేసిన స్ప్రేని అప్లై చేయాలి. కాసేపు తలకు మసాజ్ చేయాలి. ఉదయం లేచాక మరోసారి వాల్‌నట్ పీల్ స్ప్రేని జుట్టుకు అప్లై చేయాలి. గంటసేపు ఆరనిచ్చిన తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ పద్ధతిలో వారానికి 2-3 సార్లు స్నానం చేయడం వల్ల జుట్టు నల్లగా మారడం ప్రారంభమవుతుంది.

వాల్‌నట్ హెయిర్ స్ప్రే‌లో వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు..

వాల్‌నట్స్ పీల్స్‌లో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వాల్‌నట్ పీల్స్‌తో తయారు చేసిన స్ప్రే వినియోగం వల్ల తలపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు సంబంధిత సమస్యలను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్