- Telugu News Photo Gallery Science photos Pyura chilensis: This is world's most mysterious stone, blood comes out when cut, know its secret
Mysterious Stone: ప్రాణం ఉన్న రాళ్లు.. గాయపరిస్తే రక్తం కూడా కారుతుంది! నమ్మబుద్ధికావట్లేదా ఐతే మీరే తెల్సుకోండి..
రాళ్లకు రక్తమాంసాలు, ఫీలింగ్స్ ఉండవు. అందుకే మంచి మనసులేని వ్యక్తులను రాతి గుండె అని దెప్పిపొడుస్తాం. ఐతే ప్రపంచంలో ఒక వింతైన రాయి ఉంది. ఆ రాయిని పగలగొట్టితే.. దాని నుంచి రక్తం కారుతుంది. ఇదేమీ చందమామ కథకాదు. నిజంగానే..
Updated on: Oct 30, 2022 | 11:02 AM

రాళ్లకు రక్తమాంసాలు, ఫీలింగ్స్ ఉండవు. అందుకే మంచి మనసులేని వ్యక్తులను రాతి గుండె అని దెప్పిపొడుస్తాం. ఐతే ప్రపంచంలో ఒక వింతైన రాయి ఉంది. ఆ రాయిని పగలగొట్టితే.. దాని నుంచి రక్తం కారుతుంది. ఇదేమీ చందమామ కథకాదు. నిజంగానే భూమిపై ఇటువంటి రాళ్లు కూడా ఉన్నాయి.

ఈ రాళ్లను నేలకేసి కొట్టినా, అవి విరిగినా.. లోపల్నుంచి రక్తంతోపాటు మాంసంలాంటి పదార్ధం కూడా బయటకు వస్తుంది. నిజానికి ఇలాంటి రాళ్లను కొంతమంది వ్యక్తులు చాలా ఇష్టంగా తింటారు. 'పియురా చిలియెన్సిస్' అని పిలిచే ఈ వింతైన రాళ్లు దక్షిణ అమెరికా దేశాలైన చిలీ, పెరూ సముద్ర అడుగు భాగంలో పెద్దపెద్ద రాళ్లకు అంటుకుని పెరుగుతాయి. వీటిని పీరియడ్ రాక్ అని కూడా అంటారు.

నిజానికివి.. చూడ్డానికి అచ్చం రాళ్లలా కనిపించే సముద్ర జీవులు. వీటి పై భాగం గట్టిగా ఉంటుంది. లోపల అంతా మెత్తని మాంసం ఉంటుంది. ఇవి కూడా శ్వాస తీసుకుంటాయి. అలాగే ఇతర జీవుల మాదిరి ఆహారం కూడా తింటాయి. పిల్లలకు జన్మనిస్తుంది.

ప్రపంచంలోని వివిధ ప్రసిద్ధ రెస్టారెంట్లలో ఈ రాయితో రకరకాల ఆహారాలు, సలాడ్లు తయారు చేస్తారు. ఐదే స్థానికులు మాత్రం ఈ రాళ్లను వండుకోకుండా పచ్చిగానే తింటారు.

వీటిని వెతకడానికి ప్రజలు సముద్రపు లోతుల్లోకి వెళ్లి అన్వేషిస్తుంటారు. ఐతే పియురా చిలియెన్సిస్ రాళ్లు చాలా అరుదుగా మాత్రమే దొరుకుతాయి. వీటి మాంసానికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ.
