Papaya: బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారా..? బొప్పాయిని ఇలా తింటే నడుము సన్నబడుతుందట.. ట్రై చేయండి

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Oct 29, 2022 | 12:58 PM

ఆధునిక కాలంలో చాలామంది.. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి నాటినుంచి బరువు పెరగడం, బెల్లీ ఫ్యాట్ లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు.

Papaya: బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారా..? బొప్పాయిని ఇలా తింటే నడుము సన్నబడుతుందట.. ట్రై చేయండి
Papaya Benefits
Follow us

ఆధునిక కాలంలో చాలామంది.. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి నాటినుంచి బరువు పెరగడం, బెల్లీ ఫ్యాట్ లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మీరు కూడా స్థూలకాయం లాంటి సమస్యతో బాధపడుతుంటే.. బొప్పాయి తినడం ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్యనారు. ఇది మీ పొట్టను శుభ్రంగా ఉంచడమే కాకుండా.. మీ శరీరంలో అనేక పోషకాలను భర్తీ చేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కావున మీరు తీసుకునే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మరోవైపు బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. బొప్పాయి బాగా సహాయపడుతుంది. ఇంకా బరువు తగ్గడానికి బొప్పాయిని ఎలా తినవచ్చు..? ఎప్పుడు తినవచ్చు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

బెల్లీ ఫ్యాట్, బరువు తగ్గించడానిక బొప్పాయి పండును ఈ విధంగా తినండి

బొప్పాయి – పెరుగు: బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడుతుంటే మీరు ఉదయాన్నే అల్పాహారంలో పెరుగులో కట్ చేసిన బొప్పాయిని తినవచ్చు. మీరు ఇందులో మరికొన్ని పండ్లను కూడా చేర్చుకోవచ్చు. ఇందులో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఇది తింటే చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది. అతిగా తినకుండా ఉంటారు.

పాలు – బొప్పాయి: ఉదయాన్ని భారీగా అల్పాహారం తినాలనుకుంటే బొప్పాయి ట్రై చేయవచ్చు. ఒక గ్లాసు క్రీమ్ పాలు – బొప్పాయి కలిపి తీసుకోవాలి. దీనితో మీకు ప్రొటీన్లు కూడా అందుతాయి. మీ కడుపు చాలా గంటలపాటు నిండి ఉంటుంది. ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది. దీంతో నడుము స్లిమ్ అవ్వడమే కాకుండా బరువు తగ్గుతారు.

ఇవి కూడా చదవండి

బొప్పాయి చాట్: సాదా బొప్పాయి తినడానికి ఇష్టపడకపోతే.. బొప్పాయి చాట్‌ను తయారు చేసి కూడా తినవచ్చు. దీని కోసం, బొప్పాయిని ముక్కలుగా కట్ చేసి దానిపై నల్ల ఉప్పు, నల్ల మిరియాల పొడిని చల్లుకోండి. ఇప్పుడు దానిని ఆస్వాదిస్తూ తినండి.

స్నాక్స్: ఇంకా.. బొప్పాయిని స్నాక్స్, సలాడ్ రూపంలో కూడా తినవచ్చు. రోజూ తింటే.. జీర్ణక్రియ మెరుగుపడటంతోపాటు.. బరువు తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu