Rishab Shetty: అప్పులోళ్ల నుంచి తప్పించుకునేందుకు మారువేషాల్లో తిరిగా.. గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకున్న కాంతారా హీరో
ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు దాటితే కానీ సినిమా ఇండస్ట్రీలో స్థిరపడలేం. ఆత్మవిశ్వాసం, మనోబలం నిండుగా ఉన్నవారే ఈ రంగంలో సక్సెస్ అవుతారు. ఈ కోవకే చెందుతాడు కాంతారా హీరో రిషబ్‌శెట్టి.
సినీతారల జీవితం తామరాకుపై నీటి బిందువు లాంటిది. ఇక్కడ సక్సెస్‌కు మాత్రమే విలువు ఉంటుంది. రంగుల ప్రపంచం లాంటి ఈ రంగంలో నిలదొక్కుకోవాలంటే మామూలు విషయం కాదు. ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు దాటితే కానీ సినిమా ఇండస్ట్రీలో స్థిరపడలేం. ఆత్మవిశ్వాసం, మనోబలం నిండుగా ఉన్నవారే ఈ రంగంలో సక్సెస్ అవుతారు. ఈ కోవకే చెందుతాడు కాంతారా హీరో రిషబ్‌శెట్టి. ఒకే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన జీవితం పూలపాన్పేమీ కాదు. మనకు తెలియని ఎన్నో కన్నీళ్లు, కష్టాలు తన జీవితంలో ఉన్నాయంటున్నాడీ కన్నడ హీరో. ప్రస్తుతం కాంతారా సినిమా సక్సెస్‌ను మనసారా ఆస్వాదిస్తోన్న రిషబ్ శెట్టి తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో భాగంగా తన జీవితంలోని చేదు అనుభవాలు, గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.
సినిమా వేషాల తోనే బయట తిరిగాను..
‘ నా ఖర్చుల కోసం చదువుకునేటప్పుడే మినరల్ వాటర్ వ్యాపారం మొదలు పెట్టాను. రాత్రంతా నీళ్లు సప్లై చేసి వ్యానుల్లోనే నిద్రపోయేవాడిని. ఇందులో వచ్చిన డబ్బుతో సినిమాల్లోకి వెళ్లాను. కానీ ఏడాదిపాటు షూటింగ్‌లో పనిచేస్తే రూ.1500 వచ్చాయి. దీంతో సినిమాలు వద్దనుకుని హోటల్ వ్యాపారంలోకి అడుగపెట్టాను. నా వద్ద ఉన్న డబ్బుతో పాటు కొంత అప్పుచేసి 2009లో హోటల్ ప్రారంభించాను. కానీ 5 నెలల్లోనే నష్టా్ల్లో కూరుకుపోయాను. పెట్టుబడిపోనూ రూ.25 లక్షల అప్పు మిగిలించి. ఆ అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్లీ వేరేవారి దగ్గర అప్పులు చేయాల్సి వచ్చింది. అలా 2012 వరకూ ఈ అప్పులు కడుతూనే ఉన్నాను. అయితే ఎన్ని కష్టాలెదురైనా సినిమాలపై ఆసక్తి మాత్రం తగ్గలేదు. వేషాల కోసం తిరిగాను. ఆ సమయంలో అప్పులోళ్ల బారి నుంచి తప్పించుకునేందుకు సినిమాల్లోని వేషాలతోనే బయటా తిరిగే వాణ్ణి. అలాగే చిన్న సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశాలు పొందాను. ఆ తర్వాత కొందరు స్నేహితుల సహకారంతో సినిమాలు తెరకెక్కించాను’ అంటూ తన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు రిషబ్.
కాగా కన్నడ నాట చిన్న సినిమాగా విడుదలైన కాంతారా ఇప్పటికే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరింది. తెలుగు రాష్ట్రల్లోనూ రూ.50 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. రిషబ్ హీరోగా నటించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించింది. ప్రతిష్ఠాత్మక హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ సినిమాపై కొన్ని వివాదాలు నడుస్తోన్న కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడం లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
ఇది కూడా చదవండి..
అటు ‘సమరం’.. ఇటు ‘బేరం’.. తారకరాముడి స్పందనేంటి?.. ‘రజనీతో రామ్’.. బిగ్ న్యూస్ బిగ్ డిబేట్..