Samantha: అప్పుడే సమంత ఆరోగ్యం క్షీణించిందనుకుంటున్నా.. స్టార్‌ హీరోయిన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

తాజాగా సామ్‌తో కలిసి యశోద సినిమాలో స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్‌ ఈ విషయంపై స్పందించింది. ఆమె త్వరలోనే కోలుకుని మరింత బలంగా తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది

Samantha: అప్పుడే సమంత ఆరోగ్యం క్షీణించిందనుకుంటున్నా.. స్టార్‌ హీరోయిన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
Varalakshmi, Samantha
Follow us

|

Updated on: Nov 01, 2022 | 10:48 AM

హీరోయిన్‌ సమంతకు మయోసైటిస్‌ అనే వ్యాధి ఉందని తెలిసి టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్‌ ఉలిక్కిపడ్డాయి. ఆయా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సామ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌, నాగబాబు, అక్కినేని అఖిల్‌, సుశాంత్, శ్రియా, రాశిఖన్నా, సుస్మిత కొణిదెల, జాన్వీకపూర్‌, కియారా అద్వానీ, జెనీలియా, హన్సిక, మంచులక్ష్మి, ప్రగ్యాజైస్వాల్‌, కృతిసనన్‌, కీర్తిసురేశ్‌, విమలారామన్‌ తదితరులు ఆమె ఆరోగ్యం బాగుపడాలని కాంక్షిస్తూ పోస్టులు పెట్టారు. తాజాగా సామ్‌తో కలిసి యశోద సినిమాలో స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్‌ ఈ విషయంపై స్పందించింది. ఆమె త్వరలోనే కోలుకుని మరింత బలంగా తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘సామ్‌ నాకు 12 ఏళ్లగా తెలుసు. చెన్నైలోనే మా ఇద్దరికీ పరిచయం ఉంది. యశోద సినిమాలో తనతో కలిసి నటించినందుకు ఆనందంగా ఉంది. సెట్‌లో మేం ఎంతో సరదాగా ఉండేవాళ్లం. చెన్నైలో పాత రోజుల్ని గుర్తు చేసుకుని బాగా నవ్వుకునేవాళ్లం. అయితే యశోద్‌ షూటింగ్‌ సమయంలో సామ్‌ అనారోగ్యంతో ఉన్నట్లుగా మాకు అనిపించలేదు. తను చాలా యాక్టివ్‌గా ఉండేది. ఆ సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాతే ఆరోగ్యం క్షీణించిందని అనుకుంటున్నా. ఆమె ఒక యోధురాలు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తుంది’ అని వరలక్ష్మీ చెప్పుకొచ్చింది.

కాగా సామ్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం యశోద. సరోగసీ నేపథ్యంలో హరి- హరీశ్‌ సంయుక్తంగా ఈ థ్రిల్లర్‌ను రూపొందించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో ఉన్నీ ముకుందన్‌, వరలక్ష్మి, రావు రమేశ్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌ తదితర ప్రముఖులు నటిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిక్సర్ల సునామీతో రెచ్చిపోయిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్..
సిక్సర్ల సునామీతో రెచ్చిపోయిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్..
కొవ్వు మంచిదే.. ఈ 4 ఆహారాలు శరీరానికి బ్రహ్మాస్త్రాలు..
కొవ్వు మంచిదే.. ఈ 4 ఆహారాలు శరీరానికి బ్రహ్మాస్త్రాలు..
చిన్న సమస్యకే కలత చెందుతున్నారా? మానసికంగా దృఢంగా ఉండాలంటే..
చిన్న సమస్యకే కలత చెందుతున్నారా? మానసికంగా దృఢంగా ఉండాలంటే..
డ్రై స్కిన్ కారణంగా వయసు కన్నా ముందుగానే వృద్ధాప్యం..!
డ్రై స్కిన్ కారణంగా వయసు కన్నా ముందుగానే వృద్ధాప్యం..!
కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్