HIT 2: విశ్వక్‌ సేన్‌ ఏటూ వెళ్లిపోడు, హిట్ ప్రపంచం చాలా పెద్దది… సీక్వెల్‌పై డైరెక్టర్‌ ఆసక్తికర విషయాలు..

శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్‌ చిత్రం ఎంతటి విషయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సస్పెన్స్‌ కాప్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది...

HIT 2: విశ్వక్‌ సేన్‌ ఏటూ వెళ్లిపోడు, హిట్ ప్రపంచం చాలా పెద్దది... సీక్వెల్‌పై డైరెక్టర్‌ ఆసక్తికర విషయాలు..
Hit Movie Director
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 01, 2022 | 10:48 AM

శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్‌ చిత్రం ఎంతటి విషయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సస్పెన్స్‌ కాప్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ చిత్రాన్ని సీక్వెల్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అడవి శేష్‌ హీరోగా నటిస్తున్నాడు. అయితే తొలి పార్ట్‌లో విశ్వక్ సేన్ నటించగా, సెకండ్‌ పార్ట్‌లో హీరోను ఎందుకు మార్చారన్న చర్చ జరిగిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా దర్శకుడు శైలేష్‌ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా అసలు హిట్ కాన్సెప్ట్‌ ఏంటో చెప్పాడు.

హిట్ 2 టీజర్‌ అనౌన్స్‌మెంట్‌ పేరుతో విడుదల చేసిన ఈ వీడియో శైలేష్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. హిట్‌ చిత్రాన్ని హాలీవుడ్‌లో తెరకెక్కే సూపర్ హీరోల సిరీస్‌తో పోల్చాడు దర్శకుడు. దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన నేరాల విచారణ నేపథ్యంగా హిట్‌ మూవీస్‌ను తెరకెక్కిస్తున్నట్లు తెలిపాడు. ఇక హిట్‌2లో విశ్వక్‌ సేన్‌కు బదులు అడవి శేష్‌ను ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘కెప్టెన్‌ అమెరికా వస్తున్నాడని హల్క్‌ను వదలేం కదా.. విక్రమ్‌ రుద్ర రాజు ఎక్కడికీ వెళ్లడు హిట్‌ ప్రపంచంలోనే ఉంటాడు. అందరు ఆఫీసర్లు కలిసి ఒక పెద్ద కేస్‌ను సాల్వ్‌ చేస్తారు’ అని హిట్‌ మూవీస్‌ అసలు ఉద్దేశాన్ని చెప్పాడు.

ఇక హిట్‌2 చిత్రంలో మరింత థ్రిల్‌ ఉంటుందని తెలిపిన శైలేష్‌, యాక్షన్‌ కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపాడు. ఇక హిట్‌2 చిత్రానికి సంబంధించి అప్‌డేట్‌ను కూడా ఇచ్చేశాడు. అడవిశేష్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను నవంబర్‌ 3వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక డిసెంబర్ 2న హిట్-2 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే హిట్‌ సీక్వెల్‌ 2తో పూర్తి కాదని, ఈ సిరీస్‌ నుంచి మరిన్న సినిమాలు రానున్నాయని డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..