AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rambha: సీనియర్‌ నటి రంభ కారుకు యాక్సిడెంట్‌.. స్కూల్ నుంచి పిల్లలను తీసుకొస్తుండగా..

ఈ ప్రమాదంలో తనతో పాటు అందరికీ గాయాలయ్యాయని రంభ వాపోయింది. అయితే దేవుడి దయవల్ల అవన్నీ చిన్న గాయాలేనని, తన కూతురు సాషా మాత్రం ఇంకా హాస్పిటల్ బెడ్డు మీదే ఉందని భావోద్వేగానికి గురైంది

Rambha: సీనియర్‌ నటి రంభ కారుకు యాక్సిడెంట్‌.. స్కూల్ నుంచి పిల్లలను తీసుకొస్తుండగా..
Rambha Family
Basha Shek
|

Updated on: Nov 01, 2022 | 10:21 AM

Share

అలనాటి అందాల తార రంభకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తోన్న కారు మంగళవారం యాక్సిడెంట్‌కు గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో రంభతో పాటు ఆమె పిల్లలు, ఇంట్లో పనిచేసే ఆయా కూడా ఉన్నారు. ఈ విషయాన్ని రంభే సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో తనతో పాటు అందరికీ గాయాలయ్యాయని రంభ వాపోయింది. అయితే దేవుడి దయవల్ల అవన్నీ చిన్న గాయాలేనని, తన కూతురు సాషా మాత్రం ఇంకా హాస్పిటల్ బెడ్డు మీదే ఉందని భావోద్వేగానికి గురైంది. ‘పిల్లలను స్కూల్ నుంచి తీసుకు వస్తుండగా.. ఇంటర్ సెక్షన్ దగ్గర మా కారును మరో కారు ఢీ కొట్టింది. అప్పుడు కారులో నాతో పాటు పిల్లలు, ఆయా ఉన్నారు. అందరికీ చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. మేం అందరం సేఫ్ గా ఉన్నాం. అయితే చిన్నారి సాషా ఇంకా ఆసుపత్రిలో ఉంది. మాకు బ్యాడ్ టైమ్ నడుస్తోందనుకుంటా. మా కోసం భగవంతుడిని ప్రార్థించండి. నా కూతురు త్వరగా కోలుకోవాలని కోరుకోండి. మీ ప్రార్థనలు మాకు ఎంతో అవసరం’ అని సోషల్‌ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది రంభ.

రంభ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నది ఎస్‌యూవీ కార్‌ కావడంతో ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరచకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. అయితే యాక్సిడెంట్‌లో కారు మాత్రం బాగా దెబ్బతింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. రంభతో పాటు ఆమె కూతురు త్వరగా కోలుకోవాలని సినీ సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు మెసేజులు, పోస్టులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..