Trisha: త్రిష ఫేట్ మార్చేసిన పొన్నియిన్ సెల్వన్.. భారీగా పెరిగిన చెన్నై సుందరి రెమ్యునరేషన్..
ఒకే ఒక్క సినిమా త్రిష కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 23 ఏళ్లు గడిచిన త్రిషకు అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. హీరోయిన్ ఓరియెంట్‌డ్ చిత్రాల్లో నటించినా ఆశించిన విజయాలు మాత్రం అందుకోలేకపోయింది. దీంతో త్రిష కెరీర్ బండి ఇకపై ముందుకు..
ఒకే ఒక్క సినిమా త్రిష కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 23 ఏళ్లు గడిచిన త్రిషకు అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. హీరోయిన్ ఓరియెంట్‌డ్ చిత్రాల్లో నటించినా ఆశించిన విజయాలు మాత్రం అందుకోలేకపోయింది. దీంతో త్రిష కెరీర్ బండి ఇకపై ముందుకు సాగడం కష్టమేననే వాదనలు వినిపించాయి. ఇలాంటి సమయంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ త్రిష కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. మణిరత్నంలో దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ రూపంలో త్రిషకు అద్భుత పాత్ర దక్కింది. హీరోలకు ధీటుగా త్రిష పాత్రను డిజైన్ చేశాడు దర్శకుడు మణిరత్నం.
యువరాణి కుందవైగా నటించిన త్రిష తన అద్భుత నటన, అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. 2018 తర్వాత త్రిష కెరీర్‌లో మరో భారీ విజయం నమోదైంది. దీంతో త్రిషకు మళ్లీ ఆఫర్లు క్యూ కట్టాయి. పొన్నియిన్ విజయంతో అజిత్, విజయ్ చిత్రాల్లో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసిందీ బ్యూటీ. 40వ వసంతంలోకి అడుగుపెడుతున్న తరుణంలో త్రిషకు మళ్లీ ఆఫర్లు క్యూ కట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక త్రిష రెమ్యునరేషన్ అంశం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పొన్నియిన్ సెల్వన్‌కు ఈ బ్యూటీ రూ. కోటిన్నర తీసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే అజిత్, విజయ్ చిత్రాల కోసం త్రిష తన రెమ్యునరేషన్ ఏకంగా డబుల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు త్రిష ఈ సినిమా కోసం రూ. మూడు కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. చిత్ర యూనిట్ కూడా త్రిష అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు సుముకత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక త్రిష నటించిన తాజా చిత్రం ‘ది రోడ్’ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. సినిమా అవకాశాలు తగ్గుతున్నాయనుకుంటున్న సమయంలో వచ్చిన ఈ అవకాశాన్ని త్రిష ఎలా ఉపయోగించుకుంటో చూడాలి మరి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..