pushpa 2: రంగంలోకి పుష్ప రాజ్.. ఇక రూలింగ్ మొదలే..

pushpa 2: రంగంలోకి పుష్ప రాజ్.. ఇక రూలింగ్ మొదలే..

Phani CH

|

Updated on: Nov 01, 2022 | 9:46 AM

నిన్న మొన్నటి వరకు.. చాలా స్టైలిష్గా.. ఫ్యాన్సీ బట్టల్లో మెరిసిపోయిన బన్నీ.. మళ్లీ మాసిపోయిన బట్టల్లోకి మారబోతున్నారు. నిగనిగలాడే తన మోఖాన్ని మళ్లీ మట్టి కొట్టుకుపోయేలా మేకప్ చేసుకుంటున్నారు.

నిన్న మొన్నటి వరకు.. చాలా స్టైలిష్గా.. ఫ్యాన్సీ బట్టల్లో మెరిసిపోయిన బన్నీ.. మళ్లీ మాసిపోయిన బట్టల్లోకి మారబోతున్నారు. నిగనిగలాడే తన మోఖాన్ని మళ్లీ మట్టి కొట్టుకుపోయేలా మేకప్ చేసుకుంటున్నారు. చింపిరి జుట్టుతో.. భారీ గడ్డంతో.. గోని భుజంతో.. పూర్తి పుష్ప రాజ్‌ గా మారబోతున్నారు. ఎస్ ! పుష్ప ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్‌తో మంచి జోష్ మీదున్న అల్లు అర్జున్.. చాలా రోజుల తర్వాత పుష్ప2 షూట్‌లో అడుగుపెట్టారు. పూర్తి మేకప్‌ వేసుకుని పుష్ప రాజ్‌లా.. కొన్ని ఫోటోలను ఫోజిచ్చారు. సినిమాలో తన లుక్‌ ను మరింత రా అండ్‌ రస్టిక్ గా చూపించేందుకు ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా హ్యాండిలింగ్‌లలో షేర్ చేసి.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఇక పుష్ప సెకండ్ పార్ట్‌ షూట్‌ను ఈ మధ్యే స్టార్ట్ చేసిన డైరెక్టర్ సుకుమార్ … తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. అల్లు అర్జున్‌ లేకుండా ఉన్న సీన్లను పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బన్నీ కూడా ఈ షూటింగ్‌లో జాయిన్ అవ్వడం.. ఇప్పుడు వైరల్ న్యూస్గా మారింది. ఈ సినిమా గురించే అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలెంట్‌ ఉంటే అంతే !! కాంతార హీరో వెంటపడుతోన్న బాలీవుడ్

విడాకులకు ముందే.. ఈ వ్యాధి గురించి తెలుసు ??

Vishal: అమ్మాయిల విషయంలో దారుణంగా విశాల్ తీరు..

Puri Jagannadh: ‘చూడు బాస్’.. అంటూనే.. ఇచ్చిపడేసిన పూరీ

“ఆ వీడియో లీక్ చేసిన వ్యక్తిని తొలగించాం, మమ్మల్ని క్షమించండి”

 

Published on: Nov 01, 2022 09:45 AM