“ఆ వీడియో లీక్ చేసిన వ్యక్తిని తొలగించాం, మమ్మల్ని క్షమించండి”
ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌ను గెలవాలని టీమ్ ఇండియా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అయితే ఆస్ట్రేలియాలో టీమిండియా ఆటగాళ్లకు తగినన్ని సౌకర్యాలు ఉండడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌ను గెలవాలని టీమ్ ఇండియా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అయితే ఆస్ట్రేలియాలో టీమిండియా ఆటగాళ్లకు తగినన్ని సౌకర్యాలు ఉండడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. క్రికెటర్ల భద్రతపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబరు 30న మ్యాచ్ కోసం పెర్త్ వచ్చిన టీమిండియా క్రికెటర్లు ఓ హోటల్‌లో స్టే చేశారు. అయితే విరాట్ కోహ్లీ గదిలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ గదినంతా వీడియో తీశాడన్న వార్త ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనపై విరాట్ కోహ్లీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నా హోటల్ గదిలోనే నాకు ప్రైవసీ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది? ఇది నాకెంతో ఆవేదన కలిగిస్తోంది. దయచేసి ఎదుటివారి గోప్యతను గౌరవించండి. మమ్మల్ని వినోద వస్తువులుగా మాత్రం పరిగణించవద్దు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు విరాట్. కాగా ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rahul Gandhi: హైదరాబాద్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర.. లైవ్ వీడియో
వాటెన్ ఐడియా.. మట్టి లేకుండా వ్యవసాయం.. ఏడాదికి రూ.70 లక్షల ఆదాయం!
Viral Video: దున్న కోసం.. ఆడ, మగ సింహాల మధ్య భీకర పోరు.. చివరిలో సూపర్ ట్విస్ట్