ఇసుక తిన్నెలపై విరాట్ !! కోహ్లీపై పాకిస్తానీ అభిమానం చూస్తే ఫిదా అవ్వాల్సిందే !!
టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దాయాది దేశమైన పాకిస్థాన్‌లోనూ చాలామంది వీరాభిమానులు ఉన్నారు.
టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దాయాది దేశమైన పాకిస్థాన్‌లోనూ చాలామంది వీరాభిమానులు ఉన్నారు. ఇటీవల భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత ఓ పాక్ సింగర్ కోహ్లీని కలిసిన సంగతి తెలిసిందే. అతనికి కోహ్లీ తన ఆటోగ్రాఫ్‌తో కూడిన టీషర్ట్‌ను ఇచ్చి తన ఫ్యాన్స్ అంటే ఎంత మమకారమో మరోసారి చాటుకున్నాడు. తాజాగా బలూచిస్థాన్‌కు కు చెందిన విరాట్ వీరాభిమాని ఆర్‌ఏ గద్దాని కోహ్లీపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. ‘లవ్ ఫ్రమ్ ఆర్ ఎ గడ్డాని’ అంటూ ఇసుకపై విరాట్‌కొహ్లీ భారీ చిత్రాన్ని గీశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గద్దాని ఆవిష్కరించిన ఈ అద్భుతమైన స్కెచ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అలాగే ఫాజిలా బలోచ్ అనే ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ సైతం గద్దాని రూపొందించిన విరాట్ కోహ్లీ చిత్రాన్ని షేర్ చేశారు. ఈ నేపథ్యంలో కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు కానీ .. బలూచిస్థాన్ లాంటి ప్రాంతంలో కూడా వీరాభిమానులు ఉండటంపై టీమిండియా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నన్ను ఏమనుకున్నా సరే..‘పెళ్లి కాకుండా పిల్లలను కనడం తప్పుకాదు’
Mahesh Babu: సౌత్‌లో నెం1 హీరోగా మహేష్ రికార్డ్ !!
Siddharth: రసిక హీరో అంటే ఈయనే !!మళ్లీ ప్రేమలో పడ్డాడుగా !!
Samantha: సారీ సామ్.. నీ ముఖాన్ని గేలి చేసినందుకు !!
Jr NTR: సమంత పరిస్థతిపై… తారక్ ఇలా అన్నారు !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

