వాటెన్ ఐడియా.. మట్టి లేకుండా వ్యవసాయం.. ఏడాదికి రూ.70 లక్షల ఆదాయం!

వాటెన్ ఐడియా.. మట్టి లేకుండా వ్యవసాయం.. ఏడాదికి రూ.70 లక్షల ఆదాయం!

Phani CH

|

Updated on: Nov 01, 2022 | 9:28 AM

వ్యవసాయ ఆధారిత భారతదేశం సాయం లేక డీలా పడిపోయింది. ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతాంగం ఇతర మార్గాలను వెతుక్కుంటూ వలస వెళ్తున్నారు.

వ్యవసాయ ఆధారిత భారతదేశం సాయం లేక డీలా పడిపోయింది. ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతాంగం ఇతర మార్గాలను వెతుక్కుంటూ వలస వెళ్తున్నారు. దీంతో వ్యవసాయ భూములు కాలం గడిచే కొద్దీ కనుమరుగవుతూ ఉన్నాయి. ఈ తరుణంలో ఎటువంటి రసాయనాలు కలపకుండా సేంద్రీయ పద్ధతిలో సహజంగా పండించిన కూరగాయలు, పండ్లకి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరా చేసుకున్న ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించి పంట సాగు చేస్తున్నాడు. ముఖ్యంగా మహా నగరాల్లోనే కాదు, చిన్న చిన్న పట్టణాలలోను మిద్దెతోటల సంస్కృతి పెరుగుతోంది. ఆరోగ్యాన్ని, మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే ఇంటిపంటల సాగు పై ఆసక్తి చూపుతున్నారు. తమకు అనువైన చిన్నపాటి ఖాళీ స్థలాలను సైతం మొక్కలతో నింపేస్తూ..స్వయంగా సేంద్రియ పద్ధతిలో ఔషధ, పండ్లు, కూరగాయల మొక్కలని సాగు చేస్తున్నారు. ఆ విధంగానే చినప్పటి నుండి గ్రామీణ వాతావరణంలో పెరిగి, పెరటితోట పెంపకాన్ని మరువకుండా నేటికీ ఇంటిపంటను సాగు చేస్తున్నాడు ఉత్తర ప్రదేశ్ కి చెందిన రామ్ వీర్ సింగ్ అనే రైతు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: దున్న కోసం.. ఆడ, మగ సింహాల మధ్య భీకర పోరు.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

Published on: Nov 01, 2022 09:28 AM