Watch Video: బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్.. స్టన్నింగ్ క్యాచ్‌తో దుమ్మురేపిన రోహిత్ సహచరుడు..
CSA T20 Challenge: తొలుత బ్యాటింగ్‌లో కేవలం 57 బంతుల్లో 162 పరుగులను బాదేసి, బౌలర్లను ఊచకోత కోసేశాడు. ఇందులో 13 సిక్సర్లతో పాటు 13 ఫోర్లు బాదేశాడు. అనంతరం పీల్ఢింగ్‌లోనూ ప్రత్యర్థులకు సుస్సు పోయించాడు.
డెవాల్డ్ బ్రెవిస్ అలియాస్ జూనియర్ ఏబీడీగా పిలిచే ఈ సౌతాఫ్రికా ప్లేయర్.. ప్రస్తుతం తన పేరును ప్రపంచ క్రికెట్‌లో మార్మోగిస్తున్నాడు. తనలో ఎంతో ప్రతిభ ఉందని.. అటు బ్యాటింగ్, ఇటు ఫీల్డింగ్‌లోనూ దూసుకపోతున్నాడు. అయితే, దేశవాళీలో ఎన్నో మరుపురాని కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన జూనియర్ ఏబీడీ.. తన జట్టు తరపున టీ20 ప్రపంచ కప్ 2022లో మాత్రం ఎంపిక కాలేదు. అయితేనేం.. సీఎస్ఏ టీ20 ఛాలెంజ్‌లో తన దూకుడు ప్రదర్శిస్తూ.. సంచలనంగా మారాడు. తొలుత బ్యాటింగ్‌లో కేవలం 57 బంతుల్లో 162 పరుగులను బాదేసి, బౌలర్లను ఊచకోత కోసేశాడు. ఇందులో 13 సిక్సర్లతో పాటు 13 ఫోర్లు బాదేశాడు. అనంతరం పీల్ఢింగ్‌లోనూ ప్రత్యర్థులకు సుస్సు పోయించాడు. CSA T20 ఛాలెంజ్‌లో టైటాన్స్ తరపున ఆడుతున్న బ్రెవిస్.. ఈ అద్భుత ఫీల్డింగ్‌తో మరోసారి వార్తల్లోకి వచ్చేశాడు. దీంతో షాకవ్వడం తప్ప.. ఏం చేయలేని స్థితిలో ప్రత్యర్థి టీం ఉండిపోయింది.
డెవాల్డ్ బ్రెవిస్ గాలిలో విన్యాసాలు చేస్తూ.. ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. టైటాన్స్ అందించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి నైట్స్ జట్టు బరిలోకి దిగింది. నైట్స్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ కొనసాగుతోంది. దాని మొదటి బంతిని సిక్సర్‌గా మలిచేందుకు బ్యాటర్ భారీ షాట్ ఆడాడు. అయితే, బాల్ బౌండరీ వద్ద నిల్చున్న డెవాల్డ్ బ్రెవిస్ చెంతకు వచ్చింది. అతను గాలిలో విన్యాసాలు చేస్తూ.. ఆశ్చర్యకరమైన రీతిలో క్యాచ్ పట్టాడు. జాక్వెస్ సీన్‌మాన్ కొట్టిన బంతి గాలిలోకి లేచి, బౌండరీ లైన్ దాటి వెళ్లడం కనిపించింది. బౌండరీపై నిలబడిన బ్రెవిస్ బంతిని చివరి వరకు గమనించాడు. ఆపై గాలిలోకి ఎగిరి క్యాచ్ పట్టాడు. అనంతరం బౌండరీ దాటి బంతనికి లోపలికి విసిరాడు. మరలా బౌండరీ లోపలికి దూకి, అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో షాకవుతూ బ్యాటర్ పెవిలియన్ చేరాడు.
We’re witnessing greatness ?
Dewald Brevis’ talent knows no bounds!
What a catch! ?#CSAT20Challenge pic.twitter.com/pbnLZVror9
— SuperSport ? (@SuperSportTV) October 31, 2022
ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ ఆ జట్టు ఓడిపోయింది. డెవాల్డ్ బ్రెవిస్ అద్భుత ఆటతో టైటాన్స్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇందులో అతని బ్యాట్ నుంచి 162 పరుగులు వచ్చాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..