Watch Video: స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్‌తో ఆకట్టుకున్న కేన్ మామా.. నువ్ సూపరంటూ పొగిడేస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే?
ENG vs NZ: వికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోన్న కివీస్ జట్టుకు.. 5.2వ ఓవర్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ పట్టిన ఓ క్యాచ్ సంచలనంగా మారింది. జోస్ బట్లర్ కొట్టిన ఓ బంతి.. అమాంతం గాల్లోకి లేచింది.
టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలో న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య చాలా ముఖ్యమైన మ్యాచ్ జరుగుతోంది. బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఓపెనర్లు జోస్ బట్లర్, మొయిన్ అలీ క్రీజులోకి రాగానే బ్యాట్ ఝులిపించడం మొదలుపెట్టారు. వికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోన్న కివీస్ జట్టుకు.. 5.2వ ఓవర్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ పట్టిన ఓ క్యాచ్ సంచలనంగా మారింది. జోస్ బట్లర్ కొట్టిన ఓ బంతి.. అమాంతం గాల్లోకి లేచింది. అయితే, వెనుక నుంచి కేన్ విలియమ్సన్ క్యాచ్ పట్టాడు. దీంతో అంతా ఔట్ అనుకున్నారు. బట్లర్ కూడా పెవిలియన్ చేరేందుకు సిద్ధమయ్యాడు. దీంతో కివీస్ ఆటగాళ్లు సంబురాలు కూడా మొదలుపెట్టారు. మైదానంలో ఫ్యాన్స్ కూడా మాంచి ఊపులో కనిపించారు. అయితే, ఇంతలో విలియమ్సన్‌కు ఆ క్యాచ్‌పై డౌట్ వచ్చింది. థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయమని అంపైర్‌కు సూచించాడు. దీంతో అసలు విషయం కెమెరాలో తేలిసింది. అది చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇంగ్లండ్ అభిమానులు మాత్రం సంతోషంలో కనిపించారు. కాగా, ఇలాంటినిర్షంయ తీసుకోవడంతో.. ప్రస్తుతం కేన్ మామా స్పోర్ట్స్ మెన్ స్పిరట్ చూపించాడని నెటిజన్లతోపాటు క్రికెటర్లు కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
విలియమ్సన్ స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్..
పవర్‌ప్లే చివరి ఓవర్‌ని మిచెల్ సాంట్నర్ బౌలింగ్ చేశాడు. నాలుగో బంతిని గుడ్ లెంగ్త్‌లో షార్ట్‌గా వేశాడు. బట్లర్ దానిని 30-గజాల సర్కిల్ పైన బ్యాక్‌ఫుట్‌లో ఆడటానికి ప్రయత్నించాడు. బంతి కవర్ వద్ద నిలబడిన కేన్ విలియమ్సన్ డైవింగ్ ప్రయత్నంతో క్యాచ్ పట్టాడు.
బట్లర్ పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత థర్డ్ అంపైర్ చేత క్యాచ్‌ని చెక్ చేయమని విలియమ్సన్ గ్రౌండ్ అంపైర్‌ను కోరాడు. డైవ్ కొట్టే సమయంలో విలియమ్సన్ చేతిలో నుంచి బంతి పడిపోయినట్లు రీప్లేలో తేలింది. దీంతో బట్లర్ నాటౌట్‌గా నిలిచాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం తర్వాత.. కేన్ మామా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌కు సారీ చెప్పేశాడు.
View this post on Instagram
మ్యాచ్ విషయానికి వస్తే..
టాస్ గెలిచిన ఇంగ్లండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. మిచెల్ సాంట్నర్ అలెక్స్ హేల్స్‌ను స్టంపౌట్ చేయడం ద్వారా జట్టుకు తొలి దెబ్బ ఇచ్చాడు. హేల్స్ 40 బంతుల్లో 52 (7 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేశాడు. ఇక ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్ 47 బంతుల్లో 73 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లివింగ్ స్టోన్ 20 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్స్ మాత్రం రాణించలేకపోయారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసెన్ 2 వికెట్లు, సౌథీ, సాంట్నర్, సోథీ తలో వికెట్ పడగొట్టారు.
100వ టీ20 ఆడుతోన్న బట్లర్..
జోస్ బట్లర్ ఇంగ్లండ్ తరపున 100వ టీ20 ఆడుతున్నాడు. ప్లేయింగ్ 11లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు విపరీతమైన ఫామ్‌లో ఉండగా, ఇంగ్లండ్ జట్టు ఒడిదుడుకులకు గురవుతోంది.
ఇరు జట్ల ప్లేయింగ్-11..
ఇంగ్లండ్: జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, శామ్ కుర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
గ్రూప్-1లో న్యూజిలాండ్‌దే అగ్రస్థానం..
ఈ టోర్నీలో ఇప్పటివరకు న్యూజిలాండ్ మొత్తం 3 మ్యాచ్‌లు ఆడింది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కివీ జట్టు శ్రీలంక, ఆస్ట్రేలియాలను ఓడించింది. గ్రూప్ 1లో 5 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ మ్యాచ్ వర్షం కారణంగా నిర్వహించలేకపోయింది. అతను ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించగా, ఐర్లాండ్ అతనిని ఓడించింది. గ్రూప్-1లో 3 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మొత్తం 22 టీ20లు జరగగా.. ఇంగ్లండ్ 12, న్యూజిలాండ్ 8 గెలుపొందాయి. ఒక మ్యాచ్ టై అయి, ఒక దాంట్లో ఫలితం తేలలేదు.