Video: 10 సిక్స్‌లు, 15 ఫోర్లతో తుఫాన్ సెంచరీ.. జార్ఖండ్ డైనమేట్ ఫైరింగ్ ఇన్నింగ్స్‌తో కన్నీళ్లు పెట్టిన లంక..

మొత్తం 210 నిమిషాల పాటు క్రీజులో తిష్ట వేసి, 145 బంతుల్లో 183 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లతోపాటు 15 ఫోర్లు బాదేశాడు.

Video: 10 సిక్స్‌లు, 15 ఫోర్లతో తుఫాన్ సెంచరీ.. జార్ఖండ్ డైనమేట్ ఫైరింగ్ ఇన్నింగ్స్‌తో కన్నీళ్లు పెట్టిన లంక..
Ms Dhoni
Follow us

|

Updated on: Oct 31, 2022 | 5:25 PM

ఎంఎస్ ధోని. రాంచీ వీధుల నుంచి ఉద్భవించింది ఓ స్టార్. ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రవేసిన టీమిండియా క్రికెటర్. భారత క్రికెట్ విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా, మ్యాచ్ విన్నర్‌గా పేరుగాంచిన జార్ఖండ్ డైనమేట్.. ఈరోజు అంటే అక్టోబర్ 31న ఎంతో అద్భుమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంటే 17 ఏళ్ల క్రితం ఇదే రోజున తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో వార్తల్లో నిలిచాడు. దీంతో భారత క్రికెట్‌లో తన ముద్రను ఘనంగా లిఖించేశాడు. ధోని జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం పేలుడు సాక్షిగా లంక జట్టును బలిపశువుగా మార్చేశాడు. జార్ఖండ్ డైనమేట్ ఈ గర్జన చేసిన సంవత్సరం 2005, అక్టోబర్ 31. 50 ఓవర్ల ఆ మ్యాచ్‌లో టీమిండియా 299 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే, ధోనీ ఒక్కడే 70 శాతం పరుగులు చేయడం విశేషం.

ధోని ఈ ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు, 15 ఫోర్లు..

శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్‌లో 299 పరుగుల ఛేదనకు దిగిన భారత జట్టు కేవలం 7 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. సచిన్ ఔట్‌ అవ్వడంతోపాటు సెహ్వాగ్ కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఆనాటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ధోనీని మైదానంలోకి దింపాడు. ఆపై ఏం జరిగిందనేది నేటికీ మాట్లాడుతూనే ఉంటుంటారు.

ఇవి కూడా చదవండి

ధోని మొత్తం 210 నిమిషాల పాటు క్రీజులో తిష్ట వేశాడు. ఆ సమయంలో అతను 145 బంతులు ఎదుర్కొని 183 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ధోని 10 సిక్సర్లు బాదడమే కాకుండా 15 ఫోర్లు కొట్టాడు. అంటే కేవలం 25 బంతుల్లోనే బౌండరీలతో 120 పరుగులు సాధించాడు.

ఆరుగురు బౌలర్లపై రెచ్చిపోయిన ధోని..

ధోనీ విధ్వంసాన్ని ఆపేందుకు శ్రీలంక మ్యాచ్‌లో 6 మంది బౌలర్లను ప్రయత్నించింది. కానీ, ఒక్కరు కూడా ఆపలేకపోయారు. శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్‌లో ధోనీ విధ్వంసక ఇన్నింగ్స్‌తో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో 23 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ సూపర్బ్ ఇన్నింగ్స్‌తో ధోని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు.

Latest Articles
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..