IND vs SA: భారత జట్టు ఓటమితో తలపట్టుకున్న పాకిస్తాన్.. టోర్నీ నుంచి ఔట్.. రోహిత్ సేన సెమీస్ చేరాలంటే?

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుపై దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై భారత జట్టు ఓటమి తర్వాత గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో భారీ మార్పు చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా జట్టు పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానానికి చేరుకోగా, అదే సమయంలో భారత్ రెండో స్థానానికి పడిపోయింది.

IND vs SA: భారత జట్టు ఓటమితో తలపట్టుకున్న పాకిస్తాన్.. టోర్నీ నుంచి ఔట్.. రోహిత్ సేన సెమీస్ చేరాలంటే?
Pakistan Team
Follow us
Venkata Chari

|

Updated on: Oct 30, 2022 | 9:44 PM

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి ఓటమిని చవిచూసింది. ఆదివారం పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఆఫ్రికన్ జట్టుకు 134 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమ్ ఇండియా.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఆ లక్ష్యాన్ని చేరుకోవడంతో ఓడిపోయింది. భారత్ తమ గత మ్యాచ్‌ల్లో పాకిస్థాన్, నెదర్లాండ్‌లను ఓడించింది.

దక్షిణాఫ్రికాపై భారత జట్టు ఓటమి తర్వాత గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో భారీ మార్పు చోటు చేసుకుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికా జట్టు మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలు, ఒక మ్యాచ్ వాష్ అవుట్ కావడంతో పాయింట్ల పట్టికలో నంబర్ వన్‌కు చేరుకుంది. ఇక భారత్ గురించి చెప్పాలంటే రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికాకు ఐదు పాయింట్లు, భారత్‌కు నాలుగు పాయింట్లు ఉన్నాయి.

గ్రూప్-2లో బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది. ఇది ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధించింది. బంగ్లాదేశ్‌కు కూడా నాలుగు పాయింట్లు ఉన్నాయి. కానీ, దాని నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉంది. జింబాబ్వే జట్టు మూడు మ్యాచ్‌లలో ఒక విజయం, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దు కావడం కారణంగా మొత్తం మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు పాక్ జట్టు రెండు పాయింట్లతో ఐదో స్థానంలో, నెదర్లాండ్స్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్ టోర్నీ నుంచి తప్పుకుందా?

భారత్ ఓటమి తర్వాత ప్రస్తుతం పాక్ జట్టుకు ఇబ్బందులు తలెత్తాయి. దక్షిణాఫ్రికా తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించినట్లయితే, బాబర్ సేన ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తుంది. దక్షిణాఫ్రికాను పాకిస్థాన్ ఓడించినా.. నెదర్లాండ్స్‌తోనూ దక్షిణాఫ్రికా ఆడాల్సి ఉన్నందున అది కష్టమేమీ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో చివరి మ్యాచ్‌లో ఆఫ్రికా జట్టు గెలిస్తే 7 పాయింట్లు దక్కుతాయి. మరోవైపు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లను ఓడించడం ద్వారా పాకిస్థాన్ ఆరు పాయింట్లను మాత్రమే చేరుకుంటుంది.

వచ్చే రెండు మ్యాచ్‌ల్లో భారత్..

నెదర్లాండ్స్ మాత్రమే ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓడి సెమీ-ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే భారత్ ఇప్పుడు ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. ఒక మ్యాచ్‌లో గెలిచిన తర్వాత కూడా టీమ్ ఇండియా సెమీ-ఫైనల్‌కు చేరుకోగలిగినప్పటికీ, నెట్ రన్ రేట్ విషయంపై ఆధారపడాల్సి ఉంటుంది. రోహిత్ సేన బంగ్లాదేశ్, జింబాబ్వేతో ఆడాల్సి ఉంది.

మరోవైపు, రోహిత్ సేన ఆరు పాయింట్లు మాత్రమే కలిగి ఉండేంఉకు కనీసం ఒక మ్యాచ్‌లోనైనా భారత్ ఓడిపోవాలని పాకిస్థాన్ జట్టు ప్రార్థిస్తుందనడంలో సందేహం లేదు. అప్పుడు బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు కూడా రేసులో ఉన్నాయి. రెండు మ్యాచ్‌లు గెలవడం ద్వారా బంగ్లాదేశ్ జట్టు 8 పాయింట్లకు చేరుకోవడం విశేషం. మరోవైపు జింబాబ్వే కూడా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే 7 పాయింట్లకు చేరుకోవచ్చు.

మిగిలిన గ్రూప్ 2 మ్యాచ్‌ల షెడ్యూల్ (భారత కాలమానం ప్రకారం)

2 నవంబర్.. జింబాబ్వే vs నెదర్లాండ్స్ అడిలైడ్

2 నవంబర్.. ఇండియా vs బంగ్లాదేశ్ అడిలైడ్

3 నవంబర్.. పాకిస్తాన్ vs సౌతాఫ్రికా సిడ్నీ

6 నవంబర్.. దక్షిణాఫ్రికా vs నెదర్లాండ్స్ అడిలైడ్

6 నవంబర్.. పాకిస్తాన్ v బంగ్లాదేశ్ అడిలైడ్

6 నవంబర్.. ఇండియా vs జింబాబ్వే మెల్‌బోర్న్

ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!