IND vs SA: సౌతాఫ్రికాపై గెలిస్తే టీమిండియా సెమీస్ టికెట్ ఖాయమైనట్టే.. ఇరుజట్ల ప్లేయింగ్ XI ఎలా ఉందంటే?
IND vs SA Probable Playing 11: మొత్తం 22 మ్యాచుల్లో ఇరుజట్లు తలపడగా భారత్ 13 గెలవగా, 9 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు 4-1 ఆధిక్యం ఉంది.
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆదివారం మూడో మ్యాచ్ ఆడనుంది. పెర్త్ వేదికగా జరిగే సూపర్-12 గ్రూప్-2 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్, నెదర్లాండ్స్‌ను ఓడించిన భారత జట్టు ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. సెమీఫైనల్‌లోకి ప్రవేశించడం ఖాయం. భారత టైమింగ్ ప్రకారం మ్యాచ్ సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతుంది.
గత నెలలో 2-1తో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్..
సెప్టెంబర్‌లో టీ20 ప్రపంచకప్‌నకు ముందు, భారత్ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌ను ఆడింది. ఇందులో భారత్ 2-1తో విజయం సాధించింది. ఇంతకు ముందు జరిగిన అన్ని టీ20 ప్రపంచకప్‌లలో ఇరు జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 4 గెలవగా, దక్షిణాఫ్రికా 1 మాత్రమే గెలిచింది.
T20I హెడ్ టు హెడ్ రికార్డులు: మొత్తం 22 మ్యాచుల్లో ఇరుజట్లు తలపడగా భారత్ 13 గెలవగా, 9 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు 4-1 ఆధిక్యం ఉంది.
మీకు తెలుసా?
– పురుషుల T20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా మహేల జయవర్ధనేని అధిగమించడానికి విరాట్ కోహ్లీ 28 పరుగుల దూరంలో ఉన్నాడు.
– టెంబా బావుమా భారత్‌తో జరిగిన 9 టీ20ల్లో 97.22 సగటు, స్ట్రైక్‌రేట్ వద్ద 20 సగటుతో ఉన్నాడు. పేలవ ఫాంతో కొనసాగుతున్నారు.
– సూర్యకుమార్ యాదవ్ లాగే రిలీ రోసౌ 2022లో సూఫర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సంవత్సరం 39 T20 ఇన్నింగ్స్‌లలో, అతను 178.20 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తున్నాడు. పేస్ (179.62 SR), స్పిన్ (175.67 SR) రెండింటికి వ్యతిరేకంగా రాణిస్తున్నాడు.
అద్భుతమైన ఫామ్‌లో టీమిండియా..
ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో లోకేష్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ సత్తా చాటలేకపోయారు. ఆ తర్వాత విరాట్ కోహ్లి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. నెదర్లాండ్స్‌పై రాహుల్ మళ్లీ నిరాశపరచగా, విరాట్‌తో పాటు సూర్య, రోహిత్ కూడా అద్భుతమైన అర్ధ సెంచరీలు సాధించారు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్, భువనేశ్వర్‌లతో పాటు షమీ కూడా సత్తా చాటారు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏకపక్షంగా విజయం సాధించింది.
దక్షిణాఫ్రికా కూడా ఫుల్ ఫాంలోనే..
దక్షిణాఫ్రికా జట్టు కూడా ఏ విధంగానూ వెనుకంజలో లేదు. బలమైన టీ20 జట్టుకు ఉండాల్సినవన్నీ ఆ జట్టు వద్ద ఉన్నాయి. క్వింటన్ డి కాక్, కెప్టెన్ బాబూమా, రిలే రస్సోతో పాటు డేవిడ్ మిల్లర్ వంటి అటాకింగ్ బ్యాటర్లు జట్టుతో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో కగిసో రబాడ, ఎన్రిక్ నోర్త్యా, తబ్రేజ్ షమ్సీ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ జట్టుకు ఉన్న ఒక ప్లస్ పాయింట్ వారి అద్భుతమైన ఫీల్డింగ్. ఓవరాల్‌గా చూస్తే ఈ జట్టు భారత్‌కు తీవ్రమైన సవాల్ ఇవ్వగలదు.
పిచ్, వాతావరణం..
ఆదివారం పెర్త్‌లో రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్ పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. ఆ తర్వాత ఇదే పిచ్‌పై భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ జరగనుంది. ఈ వికెట్‌పై తేలికపాటి గడ్డి కూడా ఉంది. ఇది ఫాస్ట్ బౌలర్లకు మేలు చేస్తుంది.
ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించవచ్చు. వాతావరణ సూచన ప్రకారం వర్షం పడే అవకాశం 30%గా ఉంది. గాలి వేగం కూడా గంటకు 35 కి.మీ. అయితే సాయంత్రానికి తగ్గుముఖం పట్టవచ్చని తెలుస్తోంది.