IND vs SA: పెర్త్‌లో హోరాహోరీ పోరు తప్పదా.. దక్షిణాఫ్రికాపై టీమిండియా రికార్డులు ఎలా ఉన్నాయంటే?

T20 World Cup 2022, India vs South Africa: భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ ఆధిక్యాన్ని కనబరిచేలా కనిపిస్తోంది.

IND vs SA: పెర్త్‌లో హోరాహోరీ పోరు తప్పదా.. దక్షిణాఫ్రికాపై టీమిండియా రికార్డులు ఎలా ఉన్నాయంటే?
India Vs South Africa
Follow us
Venkata Chari

|

Updated on: Oct 29, 2022 | 6:31 PM

టీ20 ప్రపంచ కప్ 2022లో భాగంగా ఆదివారం పెర్త్‌లో 30వ మ్యాచ్‌లో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. కాగా తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఇరు జట్లు ఫలితం కోసం హోరాహోరీగా పోరాడునున్నట్లు తెలుస్తోంది. కానీ రికార్డుల ప్రకారం భారత్ పైచేయి భారీగానే కనిపిస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఇప్పటివరకు భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లను పరిశీలిస్తే.. ఇందులో టీమిండియా పైచేయి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 23 మ్యాచ్‌లు జరిగాయి. ఈ సమయంలో భారత్ 13 మ్యాచ్‌లు గెలిచింది. కాగా 9 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. అదే సమయంలో, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. దక్షిణాఫ్రికా జట్టు ఇటీవల భారత్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ జరిగింది. ఇందులో భారత్ 2-1తో విజయం సాధించింది. ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ 16 మ్యాచుల్లో 405 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లి 12 మ్యాచ్‌ల్లో 306 పరుగులు చేశాడు. దినేష్ కార్తీక్ ఐదో స్థానంలో ఉన్నాడు. 12 మ్యాచ్‌లు ఆడి 215 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇరు జట్లు:

భారత్ – రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, రిషబ్ పంత్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ హుడా

దక్షిణాఫ్రికా – క్వింటన్ డి కాక్ (కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), రిలే రోసౌ, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, ఎన్రిక్ నార్ట్జే, లుంగీ న్గిడి, హెన్రిక్ క్లాసెన్, తబ్రెజ్ షమ్సీ హెండ్రిక్స్, రీజా హెండ్రిక్స్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!