T20 WC 2022: సెమీస్‌లో టీమిండియాను ఢీకొట్టేది ఎవరు.. ఆసక్తిగా మారిన గ్రూప్-1 ఫలితాలు.. రేసులో 3 జట్లు..

T20 World Cup 2022 Semi Final Scenarios: గ్రూప్-2లో భారత జట్టు అగ్రస్థానంలో నిలిస్తే.. సెమీఫైనల్లో గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడనుంది. అదే సమయంలో భారత్‌ రెండో స్థానంలో నిలిస్తే గ్రూప్‌-1లో టేబుల్‌ టాపర్‌తో పోటీపడుతుంది.

T20 WC 2022: సెమీస్‌లో టీమిండియాను ఢీకొట్టేది ఎవరు.. ఆసక్తిగా మారిన గ్రూప్-1 ఫలితాలు.. రేసులో 3 జట్లు..
T20 World Cup 2022 Semi Final Scenarios
Follow us
Venkata Chari

|

Updated on: Oct 29, 2022 | 6:13 PM

శుక్రవారం ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన సూపర్-12 గ్రూప్-1 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. సెమీఫైనల్‌కు చేరుకోవడానికి ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకమైంది. కానీ, మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. అలాగే శుక్రవారం ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్ మధ్య మరో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. కాగా, నేడు జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై భారీ సాధించిన న్యూజిలాండ్.. ప్రస్తుతం గ్రూప్ 1లో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఈ గ్రూప్‌లోని 6 జట్లలో న్యూజిలాండ్ 5 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఐర్లాండ్ టీంలు తలో 3 పాయింట్లతో నిలిచిపోయాయి. దీంతో గ్రూపులో సెమీస్ చేరే జట్లపై భారీగా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ టోర్నీలో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరితే గ్రూప్ 1 నుంచి ఎవరితో తలపడనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రూప్ 1లో టాప్-2 స్థానంలో నిలవాలంటే ఆ తర్వాత జట్లు ఏం చేయాలో ఈ లెక్కలు చూద్దాం..

ముందుగా శ్రీలంక ఖాతాలో 3 మ్యాచ్‌ల్లో 2 పాయింట్లు ఉన్నాయి. శ్రీలంక నెట్ రన్ రేట్ +0.890గా ఉంది. దసున్ షనక నేతృత్వంలోని జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. టోర్నీలో మొదటి నాలుగు జట్లలో చోటు దక్కించుకోవాలంటే ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్‌లను తప్పక ఓడించాల్సిన పరిస్థితి. ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే 4 పాయింట్లతో సులువుగా టాప్-4కు చేరుకుంటుంది. ఆ రెండు మ్యాచ్‌ల ఫలితాలు మారితే మాత్రం మిగతా జట్ల ఫలితాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది.

రేసులోనే ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్లు..

శుక్రవారం ఆస్ట్రేలియా Vs న్యూజిలాండ్ మ్యాచ్ జరిగి ఉంటే, ఓడిపోయిన జట్టు టాప్ ఫోరుకు చేరుకోవడం దాదాపు అసాధ్యంగా మారేది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లు ఇప్పుడు రేసులో ఉన్నాయి. తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే సెమీ ఫైనల్‌కు చేరే అవకాశాలు దక్కినట్లే. ప్రస్తుతం ఇంగ్లండ్‌ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడి మూడు పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది.

ఇవి కూడా చదవండి

T20 ప్రపంచ కప్ 2022 పాయింట్ల పట్టిక..

సూపర్ 12 – గ్రూప్ A

క్రమం సంఖ్య జట్టు ఆడింది గెలిచింది ఓడినవి N/R టై NET RR పాయింట్లు
1 న్యూజిలాండ్న్యూజిలాండ్ 3 2 0 1 0 +3.850 5
2 ఇంగ్లండ్ఇంగ్లండ్ 3 1 1 1 0 +0.239 3
3 ఐర్లాండ్ఐర్లాండ్ 3 1 1 1 0 -1.169 3
4 ఆస్ట్రేలియాఆస్ట్రేలియా 3 1 1 1 0 -1.555 3
5 శ్రీలంకశ్రీలంక 3 1 2 0 0 -0.890 2
6 ఆఫ్ఘనిస్తాన్ఆఫ్ఘనిస్తాన్ 3 0 1 2 0 -0.620 2

అదే సమయంలో ఆస్ట్రేలియా ఇప్పుడు మూడు మ్యాచ్‌ల నుంచి మూడు పాయింట్లను కలిగి ఉంది. ఆటీం నెట్ రన్ రేట్ -1.555గా నిలిచింది. ఇది ఇంగ్లాండ్ +0.239 నెట్ రన్ రేట్ కంటే చాలా దారుణంగా ఉంది. సూపర్-12లో ఆస్ట్రేలియా తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఐర్లాండ్‌, ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. ఈ జట్ల నుంచి ఆస్ట్రేలియా భారీ తేడాతో గెలిస్తే, దాని నెట్ రన్ మెరుగుపడుతుంది.

మరోవైపు న్యూజిలాండ్, శ్రీలంక జట్లతో ఇంగ్లండ్ తలపడాల్సి ఉంది. న్యూజిలాండ్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించింది. ఇలాంటి పరిస్థితుల్లో కివీ జట్టును ఓడించడం ఇంగ్లండ్‌కు అంత సులువు కాదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తమ మిగిలిన మ్యాచ్‌లు గెలిస్తే తలో 7 పాయింట్లు ఉంటాయి. అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ 5 పాయింట్లతో గ్రూప్-1లో నిలిచింది. ఇంగ్లండ్, ఐర్లాండ్‌లతో మరో 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ జట్టు గెలిస్తే 9 పాయింట్లు సాధించి సెమీఫైనల్‌కు సులభంగా చేరుతుంది. అయితే న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్‌పై ఓడి ఐర్లాండ్‌పై గెలిస్తే సెమీఫైనల్‌కు చేరే అవకాశాల్లో మార్పులు ఉండొచ్చు.

గ్రూప్ బి

క్రమం సంఖ్య జట్టు ఆడింది గెలిచింది ఓడినవి N/R టై NET RR పాయింట్లు
1 భారతదేశంభారతదేశం 2 2 0 0 0 +1.425 4
2 దక్షిణ ఆఫ్రికాదక్షిణ ఆఫ్రికా 2 1 0 1 0 +5.200 3
3 జింబాబ్వేజింబాబ్వే 2 1 0 1 0 +0.050 3
4 బంగ్లాదేశ్బంగ్లాదేశ్ 2 1 1 0 0 -2.375 2
5 పాకిస్తాన్పాకిస్తాన్ 2 0 2 0 0 -0.050 0
6 నెదర్లాండ్స్నెదర్లాండ్స్ 2 0 2 0 0 -1.625 0

ఐర్లాండ్, అఫ్గానిస్థాన్‌లు సెమీఫైనల్‌కు చేరుకోవడం కష్టమే..

ఐర్లాండ్ గ్రూప్ 1లో రెండు భారీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ రెండు జట్లు గత ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు ప్రయాణించాయి. ఐర్లాండ్ ప్రస్తుతం మూడు పాయింట్లను కలిగి ఉంది. సెమీ-ఫైనల్‌కు చేరుకోవడానికి రెండు మ్యాచ్‌లు గెలవాలి. ఒక్క మ్యాచ్‌లో అయినా ఓడిపోతే సెమీ ఫైనల్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే.

T20 World Cup 2022 Semi Final Scenarios

సెమీఫైనల్ రేసు నుంచి ఆఫ్ఘనిస్థాన్ దాదాపు నిష్క్రమించింది. సూపర్-12లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు.. ఇంగ్లండ్‌పై ఓడిపోయింది. అదే సమయంలో ఐర్లాండ్, న్యూజిలాండ్‌లతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కాబట్టి ఆఫ్ఘాన్ ఖాతాలో ఇప్పుడు 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి.

శ్రీలంక, ఆస్ట్రేలియాతో ఈ గ్రూప్‌లో ఆఫ్ఘనిస్తాన్ మరో 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇవి ఆ జట్టుకు చాలా కష్టతరమైన మ్యాచ్‌లు. ఆఫ్ఘనిస్థాన్‌ ఒక్క మ్యాచ్‌ అయినా ఓడిపోతే సెమీఫైనల్‌కు దూరమవుతుంది.

భారత్‌తో ఢీకొట్టేది ఎవరంటే?

గ్రూప్-2లో భారత జట్టు అగ్రస్థానంలో నిలిస్తే.. సెమీఫైనల్లో గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడనుంది. అదే సమయంలో భారత్‌ రెండో స్థానంలో నిలిస్తే గ్రూప్‌-1లో టేబుల్‌ టాపర్‌తో పోటీపడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో న్యూజిలాండ్ టేబుల్ టాపర్‌గా నిలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు రెండో స్థానం కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు పోటీ పడతాయని భావిస్తున్నారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఫలితాలు మారుతున్న క్రమంలో.. టాప్ 2లో జట్లపై ఓ అంచనా కుదరడం లేదు. ఒకవేళ ఊహలు నిజమైతే.. సెమీస్‌లో రోహిత్ సేన న్యూజిలాండ్ లేదా ఆస్ట్రేలియాతో తలపడే ఛాన్స్ ఉంది. ఒకవేళ న్యూజిలాండ్‌తోపాటు ఇంగ్లండ్ జట్లు సెమీస్ చేరితే టాస్ 2 మార్పులతో ఇంగ్లండ్‌తోనూ ఆడే ఛాన్స్ ఉంటుంది.