NZ vs SL: లంకపై భారీ విజయం.. అగ్రస్థానం చేరిన న్యూజిలాండ్.. సెంచరీతో సత్తా చాటిన పిలిప్స్..

కివీస్ విధించిన 168 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక పోయిన లంక జట్టు కేవలం 102 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కివీస్ టీం 65 పరుగుల తేడాతో విజయం సాధించింది.

NZ vs SL: లంకపై భారీ విజయం.. అగ్రస్థానం చేరిన న్యూజిలాండ్.. సెంచరీతో సత్తా చాటిన పిలిప్స్..
Nz Vs Sl Match Report
Follow us
Venkata Chari

|

Updated on: Oct 29, 2022 | 5:23 PM

సిడ్నీ వేదికగా న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిని మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో 5 పాయింట్లతో గ్రూప్ 1లో అగ్రస్థానంలోకి చేరుకుంది. కివీస్ విధించిన 168 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక పోయిన లంక జట్టు కేవలం 102 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కివీస్ టీం 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెంచరీ ఇన్నింగ్స్‌తో సత్త చాటిన గ్లెన్ పిలిప్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టాస్ గెలిచిన కేన్ విలియమ్సన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 20 ఓవర్లలో కివీస్ జట్టు 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ 64 బంతుల్లో 104 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ఈ ప్రపంచకప్‌లో ఇది రెండో సెంచరీ. బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఆటగాడు రిలే రస్సో తొలి సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.

శ్రీలంక తరపున కసూన్ రజిత అత్యధికంగా 2 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, మహేష్ తీక్షణ, ధనంజయ్ డి సిల్వా, హస్రంగ, లహిరు కుమార ఒక్కో వికెట్ పడగొట్టారు. దీనికి ప్రతిగా శ్రీలంకలో పరిస్థితి దారుణంగా తయారైంది. 19.2 ఓవర్లలో 102 పరుగులకు లంక జట్టు అలౌట్ అయింది. లంక బ్యాటర్లలో రాజపక్సే 34, శనక 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. మిగతా బ్యాటర్స్ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. వీరిలో ముగ్గురు బ్యాటర్లు జీరోకే పెవిలియన్ చేరారు. ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్ ఖాతాలో 2 వికెట్లు చేరాయి. టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్ తలో 1 వికెట్ తీశారు.

కాగా, ఈ విజయంతో న్యూజిలాండ్ జట్టు గ్రూప్ 1 లో అగ్రస్థానం చేరగా, శ్రీలంక జట్టు మాత్రం చివరి స్థానానికి పడిపోయింది. ఈ గ్రూపులోని అన్ని జట్లు మూడు మ్యాచ్‌లు ఆడాయి. 5 పాయింట్లతో కివీస్ తొలిస్థానంలో తిష్ట వేయగా, 3పాయింట్లతో ఇంగ్లండ్ రెండోస్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి

రెండు జట్ల ప్లేయింగ్ XI..

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, కేన్ విలియమ్సన్ (కప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

శ్రీలంక: పాతుమ్ నిసంకా, కుసల్ మెండిస్ (కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అస్లాంక, భానుక రాజపక్స, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, లహిరు కుమార, మహేష్ తీక్షణ మరియు కసూన్ రజిత.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!