T20 World Cup: 142 కిమీ వేగంతో పాక్‌ బౌలర్‌ రాకాసి బౌన్సర్‌.. క్రీజులోనే కూలబడిపోయిన డచ్‌ బ్యాటర్

టీ20 వరల్డ్‌కప్‌ భాగంగా ఆదివారం(అక్టోబర్‌ 30) పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ బ్యాటర్‌ బాస్‌ డి లీడ్‌ ముఖానికి తీవ్ర గాయమైంది. నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌లో పాక్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ విసిరిన బౌన్సర్‌.. బాస్‌ డి లీడ్‌ హెల్మెట్‌ లోపలికి చొచ్చుకుపోయి అతని ముఖాన్ని గట్టిగా తాకింది.

T20 World Cup: 142 కిమీ వేగంతో పాక్‌ బౌలర్‌ రాకాసి బౌన్సర్‌.. క్రీజులోనే కూలబడిపోయిన డచ్‌ బ్యాటర్
Pakistan Vs Netherlands
Follow us
Basha Shek

|

Updated on: Oct 31, 2022 | 7:29 AM

జెంటిల్మెన్‌ గేమ్‌గా పేరొందిన క్రికెట్‌లో గాయాలు సహజమే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి గాయాలు తగలకమానవు. ఇక ఫాస్ట్‌ బౌలర్ల విసిరే బౌన్సర్లు, బీమర్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. బ్యాటర్లకు ప్రాణసంకటంగా భావించే వీటిని నిషేధించాలని ఎప్పటినుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ అమల్లోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో రాకాసి బౌన్సర్‌ కారణంగా మరో బ్యాటర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. టీ20 వరల్డ్‌కప్‌ భాగంగా ఆదివారం(అక్టోబర్‌ 30) పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ బ్యాటర్‌ బాస్‌ డి లీడ్‌ ముఖానికి తీవ్ర గాయమైంది. నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌లో పాక్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ విసిరిన బౌన్సర్‌.. బాస్‌ డి లీడ్‌ హెల్మెట్‌ లోపలికి చొచ్చుకుపోయి అతని ముఖాన్ని గట్టిగా తాకింది. ఈ దెబ్బకు విలవిల్లాడిపోయాడు డచ్‌ బ్యాటర్‌. కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థంకాక అలాగే క్రీజ్‌లో కూలబడిపోయాడు. కాగా ఈ బంతి ఏకంగా 142 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది. దీంతో లీడ్‌ ముఖానికి బలంగా తాకడంతో రక్తం ధారగా కారింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో మైదానంలో ఉన్న ఆటగాళ్లంతా ఆందోళన చెందారు. లీడ్‌ కుడి కంటి కింది భాగంలో బంతి తగిలింది. ఒకవేళ కాస్త అటూ ఇటూ అయినా కంటికి పెద్ద దెబ్బే తగిలేది.

రక్తంతోనే డగౌట్ కు..

కాగా తీవ్రంగా గాయపడిన లీడ్‌ సహచరుల సహాయంతో డగౌట్‌కు చేరుకున్నాడు. ఆతర్వాత మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లీడ్‌ త్వరగా కోలుకోవాలని క్రికెట్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. తప్పక గెలవాల్సిన పోరులో నెదర్లాండ్స్‌పై పాకిస్తాన్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. డచ్‌ విధించిన 92 పరుగుల తేలికైన లక్ష్యాన్ని పాక్‌ 13.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్‌ బౌలర్ల దాటికి పసికూన ఏ దశలోనూ పోటీ నివ్వలేకపోయింది. షాదాబ్‌ ఖాన్‌ (3/22), మహ్మద్‌ వసీం జూనియర్‌ (2/15), షాహీన్‌ అఫ్రిది (1/19), నసీం షా (1/11), హరీస్‌ రౌఫ్‌ (1/10) సత్తా చాటడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 91 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆతర్వాత ఛేదనలో పాకిస్తాన్‌ అతి కష్టం మీద లక్ష్యాన్ని అందుకుంది. కాగా దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి చెండంతో పాక్‌ సెమీస్‌ అవకాశాలు అడుగంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..