Watch Video: 10 ఫోర్లు, 4 సిక్సులతో 160కి పైగా స్ట్రైక్ రేట్‌.. సెంచరీ ఇన్నింగ్స్‌తో లంక బౌలర్లపై బీభత్సం..

ICC Mens T20 World Cup 2022 NZ vs SL Glenn Phillips: న్యూజిలాండ్‌కు చెందిన గ్లెన్ ఫిలిప్స్ టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ చేయడం ద్వారా తన జట్టును క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించాడు. దీంతో టీ20 ప్రపంచకప్ 2022లో రెండో సెంచరీ నమోదైంది.

Watch Video: 10 ఫోర్లు, 4 సిక్సులతో 160కి పైగా స్ట్రైక్ రేట్‌.. సెంచరీ ఇన్నింగ్స్‌తో లంక బౌలర్లపై బీభత్సం..
Glenn Phillips
Follow us
Venkata Chari

|

Updated on: Oct 29, 2022 | 4:20 PM

టీ20 ప్రపంచకప్‌లో శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ ఫిలిప్స్.. పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతున్న న్యూజిలాండ్ జట్టుకు ప్రాణం పోశాడు. స్వల్ప స్కోర్‌కే ముగిసిపోవాల్సిన కివీస్ జట్టును.. ముందుండి నడిపించి, భారీ స్కోర్ దిశగా నడిపించాడు. సిడ్నీలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ పిలిప్స్ అద్భుతమైన సెంచరీ ఆధారంగా 167 పరుగులు చేసింది. శ్రీలంకకు బలమైన ఆరంభం లభించింది. దీని కారణంగా ఒక దశలో న్యూజిలాండ్ స్కోరు కీలకమైన 3 వికెట్లు కోల్పోయి కేవలం 15 పరుగులు మాత్రమే చేసింది. ఆ సమయంలో చివరిసారిగా ఫైనల్ చేరిన కివీస్ జట్టు.. ఈరోజు గౌరవప్రదమైన స్కోరు చేయలేదనిపించింది. కానీ, ఎవరూ ఊహించని విధంగా గ్లెన్ ఫిలిప్స్ ఇక్కడ నుంచి ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు.

గ్లెన్ పిలిప్స్ సెంచరీ వీడియో..

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ICC (@icc)

ఫిలిప్స్ 64 బంతుల్లో 104 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఒత్తిడి పరిస్థితుల్లోనూ 162.50 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. అతను చివరి ఓవర్‌లో లాహిరు కుమార బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. కానీ, అప్పటికే అతను తన పనిని పూర్తి చేశాడు.

ఫిలిప్స్ మినహా న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఎవరూ ఆడలేదు. కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరును అందుకోగలిగారు. ఆ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్స్ కేవలం 1 పరుగు చేసి పెవిలియన్ చేరారు. అదే సమయంలో 8 పరుగుల వద్ద కెప్టెన్ విలియమ్సన్ ఔటయ్యాడు.

ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. దీంతో లంక ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ టీం శ్రీలంక బౌలర్లపై ఆధిపత్యం చూపించింది. ఈ క్రమంలో ఫిలిప్స్ 64 బంతులు ఆడి 104 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. 162 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచ కప్ 2022లో రెండో సెంచరీ నమోదైంది. గ్లెన్ ఫిలిప్ప్ కెరీర్‌లో టీ20 ప్రపంచ కప్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. లంక బౌలర్లలో కసూన్ రజిత అత్యధికంగా 2 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, మహేష్ తీక్షణ, ధనంజయ్ డి సిల్వా, హస్రంగ, లహిరు కుమార ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

రెండు జట్ల ప్లేయింగ్ XI..

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, కేన్ విలియమ్సన్ (కప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

శ్రీలంక: పాతుమ్ నిసంకా, కుసల్ మెండిస్ (కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అస్లాంక, భానుక రాజపక్స, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, లహిరు కుమార, మహేష్ తీక్షణ మరియు కసూన్ రజిత.