టీ20 ప్రపంచకప్ 2022లో రెండో సెంచరీ నమోదు.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో బౌలర్లను చితక్కొట్టిన ఫిలిప్స్.. లంక ముందు భారీ టార్గెట్..

NZ vs SL: న్యూజిలాండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. దీంతో లంక ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ టీం శ్రీలంక బౌలర్లపై ఆధిపత్యం చూపించింది.

టీ20 ప్రపంచకప్ 2022లో రెండో సెంచరీ నమోదు.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో బౌలర్లను చితక్కొట్టిన ఫిలిప్స్.. లంక ముందు భారీ టార్గెట్..
New Zealand Vs Sri Lanka
Follow us
Venkata Chari

|

Updated on: Oct 29, 2022 | 3:27 PM

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో శనివారం న్యూజిలాండ్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. దీంతో లంక ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ టీం శ్రీలంక బౌలర్లపై ఆధిపత్యం చూపించింది. ఈ క్రమంలో ఫిలిప్స్ 64 బంతులు ఆడి 104 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. 162 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచ కప్ 2022లో రెండో సెంచరీ నమోదైంది. గ్లెన్ ఫిలిప్ప్ కెరీర్‌లో టీ20 ప్రపంచ కప్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. లంక బౌలర్లలో కసూన్ రజిత అత్యధికంగా 2 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, మహేష్ తీక్షణ, ధనంజయ్ డి సిల్వా, హస్రంగ, లహిరు కుమార ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టుకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫిన్ అలెన్ 1, డేవాన్ కాన్వే 1, కేల్ విలియమ్సన్ 8 పరుగులు చేసి త్వరగా పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన పిలిప్స్, మిచెల్ జోడీ భారీ భాగస్వామ్యంతో మ్యాచ్‌లో నిలదొక్కుకొనేలా చేసింది. అయితే, మిచెల్ 22 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు.

రెండు జట్ల ప్లేయింగ్ XI..

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, కేన్ విలియమ్సన్ (కప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

ఇవి కూడా చదవండి

శ్రీలంక: పాతుమ్ నిసంకా, కుసల్ మెండిస్ (కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అస్లాంక, భానుక రాజపక్స, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, లహిరు కుమార, మహేష్ తీక్షణ మరియు కసూన్ రజిత.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!