T20 WC 2022: టీ20 ప్రపంచ కప్ 2022లో హీరోలు వీరే.. టాప్ స్కోరర్ నుంచి బెస్ట్ ఇన్నింగ్స్ వరకు.. పూర్తి జాబితా ఇదే..
T20 World Cup 2022 Top Stats: టీ20 ప్రపంచ కప్ 2022లో మొత్తం 45 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాగా, ఇప్పటి వరకు 26 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. రికార్డుల పరంగా ఎవరు ముందున్నారో ఓసారి చూద్దాం..
T20 ప్రపంచ కప్ 2022 లో సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్‌ల తర్వాత శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండిస్ పరుగుల పరంగా అగ్రస్థానంలో ఉన్నాడు. అదే సమయంలో వికెట్లు తీయడంలో నెదర్లాండ్స్ బౌలర్ బాస్ డి లీడే ముందంజలో ఉన్నాడు. అయితే, శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్ ఆటగాళ్లు ఈ గణాంకాలలో అగ్రస్థానంలో ఉండటానికి పెద్ద కారణం కూడా ఉంది. ఈ జట్లు ఇతర జట్ల కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాయని గుర్తించుకోవాలి. సూపర్-12లోని ఇతర జట్ల కంటే శ్రీలంక, నెదర్లాండ్స్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లు క్వాలిఫయర్స్‌లోనూ ఆడడం వల్ల రికార్డుల్లో ముందున్నాయి. టీ20 ప్రపంచ కప్ 2022 సూపర్ 12లో ఆడుతోన్న జట్ల కంటే ఈ జట్లు 3 మ్యాచ్‌లు ఎక్కువగా ఆడాయి.
ఇప్పటి వరకు టీ20 ప్రపంచ కప్‌లో నమోదైన రికార్డులు ఇవే..
1. అత్యధిక స్కోరు: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
2. అతిపెద్ద విజయం: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో విజయం సాధించింది.
3. అత్యధిక పరుగులు: శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండిస్ 5 ఇన్నింగ్స్‌ల్లో 176 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 44, స్ట్రైక్ రేట్ 157.14గా నిలిచింది.
4. అత్యుత్తమ ఇన్నింగ్స్: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికాకు చెందిన రిలే రోసో 109 పరుగులు చేశాడు.
5. అత్యధిక సిక్సర్లు: రిలే రోస్సో ఇప్పటివరకు 8 సిక్సర్లు కొట్టాడు.
6. అత్యధిక వికెట్లు: నెదర్లాండ్స్ బౌలర్ బాస్ డి లీడ్ 5 ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు తీశాడు. అతని బౌలింగ్ సగటు 14.44, ఎకానమీ రేటు 8.66గా నిలిచింది.
7. ఉత్తమ బౌలింగ్: ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ సామ్ కరణ్ 3.4 ఓవర్లలో 10 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
8. బెస్ట్ వికెట్ కీపింగ్: ఇంగ్లండ్‌కు చెందిన జోస్ బట్లర్ వికెట్ వెనుక 5 వికెట్లు పడగొట్టాడు.
9. అత్యధిక భాగస్వామ్యం: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికాకు చెందిన రిలే రోస్సో, క్వింటన్ డి కాక్ 168 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.
10. అత్యధిక క్యాచ్‌లు: ఐరిష్ ఆటగాడు మార్క్ ఈడర్ 5 మ్యాచ్‌ల్లో 4 క్యాచ్‌లు పట్టాడు.
11. తొలి సెంచరీ: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా బ్యాటర్ రిలే రోసో 109 పరుగులు చేశాడు. దీంతో ఈ టోర్నీలో తొలి సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.