Virat Kohli: కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ అధ్యక్షుడు.. ఆ విషయాల్లో ఇలాంటి వాడంటూ..
Bcci President Roger Binny: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి ఏదీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కీలక వ్యాఖ్యలు చేశారు.
విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. టీ 20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అజేయంగా 82 పరుగులు చేసి బాబర్ అజామ్ జట్టు నుంచి విజయాన్ని లాగేసుకున్న తీరు క్రికెట్ ప్రపంచంలో చిరకాలం గుర్తుండిపోతుంది. మెల్‌బోర్న్‌లో కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌ను బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ కూడా ప్రశంసించారు. బీసీసీఐ అధ్యక్షుడి పదవి పొందిన తర్వాత కోహ్లీపై బిన్నీ తొలి ప్రకటన చేశాడు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కార్యక్రమంలో బిన్నీ మాట్లాడాడు. కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌కు అభినందనలు తెలిపాడు.
ఏఎన్‌ఐతో మాట్లాడిన బిన్నీ, ఇది నాకు ఒక కల లాంటిదని అన్నారు. స్టేడియంలో కోహ్లీ ఎలా షూట్ చేశాడో ఊహించలేం. ఇది గొప్ప విజయం అంటూ చెప్పుకొచ్చాడు.
అలాంటి మ్యాచ్‌లు మరోసారి చూడలేం..
ఇలాంటి మ్యాచ్‌లు మరోసారి చూడలేమని, అక్కడ ఎక్కువ సమయం మ్యాచ్ పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉందని, అయితే సడెన్‌గా భారత్ మ్యాచ్‌లోకి తిరిగి వచ్చిందని బిన్నీ చెప్పుకొచ్చాడు. ఇది ఆటకు మంచిది, ఎందుకంటే అభిమానులు అలాంటి మ్యాచ్‌లను కోరుకుంటారు. విరాట్ కోహ్లి పునరాగమనంపై బీసీసీఐ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. తనకు ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదని, కోహ్లీ ఓ క్లాస్ ప్లేయర్. ఒత్తిడిలో కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.
తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం..
టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ ప్రయాణం గురించి మాట్లాడితే, నెదర్లాండ్స్‌పై విజయంలో కోహ్లీ అత్యధికంగా 62 పరుగులు చేశాడు. 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. దీంతో భారత్ 4 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించి తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్ అంటే సూపర్ 12లో భారత్ ఆదివారం పెర్త్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
అగ్రస్థానంలో టీమిండియా..
రోహిత్ శర్మ జట్టు వరుసగా 2 విజయాలతో గ్రూప్ 2లో అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో ఖాతా తెరవడానికి పాకిస్థాన్ ఎదురుచూస్తోంది. బాబర్ అజామ్ జట్టు 2 మ్యాచ్‌లు ఓడి 5వ స్థానంలో ఉంది. ఆఖరి ఓవర్ నో బాల్ వివాదంపై బిన్నీ మాట్లాడుతూ.. మ్యాచ్ ఓడిపోయినప్పుడు దానిని సరైన మార్గంలో తీసుకోవాలి. భారత్ ఆటను ప్రజలు మెచ్చుకోవాలి అంటూ తేల్చేశాడు.