AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA T20 Weather: ఆదివారం మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉందా? వాతావరణ శాఖ ఏం చెబుతోందంటే?

వరల్డ్‌కప్‌కు వరుణుడు అడ్డుపడుతున్నాడు. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇక వర్షం కారణంగా శుక్రవారం మెల్‌బోర్న్‌లో జరగాల్సిన ఆఫ్ఘనిస్థాన్-ఐర్లాండ్, ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లు ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి.

IND vs SA T20 Weather: ఆదివారం మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉందా? వాతావరణ శాఖ ఏం చెబుతోందంటే?
Rohit Sharma
Basha Shek
|

Updated on: Oct 29, 2022 | 12:47 PM

Share

ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్‌ అండ్‌ బౌన్సీ పిచ్‌గా భావించే పెర్త్‌ మైదానంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. కాగా సెమీస్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇరు జట్లకు తప్పనసరి. ఇప్పటివరకు టీమ్ ఇండియా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 4 పాయింట్లతో +1.425 రన్ రేట్‌తో గ్రూప్‌-2లో మొదటి స్థానంలో ఉంది. ఇక రెండు మ్యాచ్‌లు ఆడిన దక్షిణాఫ్రికా ఒక దాంట్లో విజయం సాధించగా మరో మ్యాచ్‌ రద్దయింది. తద్వారా +5.200 రన్ రేట్‌, మొత్తం 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో  రోహిత్ సేన గెలిస్తే అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది. అదే సమయంలో సఫారీలు గెలిస్తే టీమ్ ఇండియా రెండో స్థానానికి పడిపోతుంది. కాగా పెర్త్  వేదికగా జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం కావడంతో హై వోల్టేజీ మ్యాచ్‌గా భావిస్తున్నారు. అయితే వరల్డ్‌కప్‌కు వరుణుడు అడ్డుపడుతున్నాడు. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇక వర్షం కారణంగా శుక్రవారం మెల్‌బోర్న్‌లో జరగాల్సిన ఆఫ్ఘనిస్థాన్-ఐర్లాండ్, ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లు ఒక్క బంతి కూడా పడకుండానే పూర్తిగా రద్దయ్యాయి.

ఈనేపథ్యంలో భారత్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగిస్తుందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. భారత- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదని తెలపింది. మ్యాచ్ జరిగే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది. దీంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా మ్యాచ్‌ జరగనుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా పెర్త్ మైదానం బౌలర్లకు స్వర్గధామం. అయితే ప్రస్తుతం పిచ్‌ బౌలర్లతో పాటు పెర్త్‌లోని ట్రాక్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

రాహుల్‌పై క్లారిటీ..

కాగా ఆదివారం మ్యాచ్‌కు ముందు జరిగే మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొననున్నాడు. ఇక్కడ జర్నలిస్టులు అడిగే కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తారు. దీంతో పాటు జట్టులో మార్పుపై కూడా సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. రోహిత్‌కు ఎదురయ్యే ప్రశ్నల్లో ప్రధానమైనది కేఎల్ రాహుల్ ఫామ్‌పైనే ఉంటుంది. పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్న రాహుల్ గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. దీంతో జట్టుకు శుభారంభం లభించడం లేదు. అందువల్ల ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉందా లేదా అనే సమాచారాన్ని వెల్లడించనున్నారు. రాహుల్ విషయంలో రోహిత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనే ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..