NZ vs SL: గ్రూప్ 1లో అగ్రస్థానంపై కన్నేసిన కివీస్, శ్రీలంక.. సిడ్నీలో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం..
T20 World Cup 2022: శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మధ్య సిడ్నీలో నేడు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు ప్లేయింగ్ XI లో కీలక మార్పులు జరగనున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2022లో భాగంగా నేడు అంటే శనివారం మధ్యాహ్నం న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ సిడ్నీలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు, న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌లు ఆడగా ఒక మ్యాచ్‌లో గెలిచింది. కాగా రెండో మ్యాచ్ వర్షం కారణంగా జరగలేదు. ఇక శ్రీలంక గురించి మాట్లాడితే, ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడింది. అంటే క్వాలిఫయర్స్‌లో మూడు, సూపర్ 12లో రెండు మ్యాచ్‌లు ఆడింది. మొత్తంగా మూడు మ్యాచ్‌లు గెలిచింది. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో శ్రీలంక జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఆధిపత్యం: న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య 19 T20Iలు ఆడాయి. ఇందులో కివీస్ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. లంక జట్టు 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒకదాంట్లో ఫలితం తేలలేదు. కానీ, ఈ టోర్నీ చరిత్రలో కివీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో శ్రీలంక విజయం సాధించింది.
న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో శ్రీలంక ప్లేయింగ్ ఎలెవన్‌లో పాతుమ్ నిశాంక, కుశాల్ మెండిస్‌లను చేర్చుకోవచ్చని తెలుస్తోంది. గాయం కారణంగా బినురా ఫెర్నాండో జట్టుకు దూరమయ్యాడు. అందువల్ల అతని స్థానంలో కసున్ రజిత ప్లేయింగ్ XIలో చోటు దక్కించుకోవచ్చు. 29 ఏళ్ల బౌలర్ కసున్‌కు ఇంకా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేదు. కానీ, అతనిలో ప్రతిభకు లోటు లేదు. న్యూజిలాండ్‌పై కసున్ బాగా రాణించగలడని జట్టు భావిస్తోంది.
న్యూజిలాండ్ జట్టు ప్లేయింగ్ XIలో ఫిన్ అలెన్, డెవాన్ కాన్వేలకు చోటు కల్పించవచ్చని తెలుస్తోంది. జట్టు అత్యుత్తమ బౌలర్ డారిల్ మిచెల్ గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే ఇప్పుడు అతను ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించారు. అయితే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కుతుందా లేదా అన్నది ఇంకా చెప్పలేని పరిస్థితి. మిచెల్ వేలికి గాయమైంది. శ్రీలంకతో జరిగే ప్లేయింగ్ XIలో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీని కూడా జట్టులో చోటు కల్పించవచ్చు.
మీకు తెలుసా?
– టిమ్ సౌథీ T20I లలో కుసాల్ మెండిస్‌ను కేవలం 21 బంతుల్లో రెండుసార్లు అవుట్ చేశాడు.
– దసున్ షనక 2022లో శ్రీలంక ప్రధాన T20I బ్యాటర్‌గా టోర్నమెంట్‌లోకి వచ్చాడు. అయితే అంతకుముందు 143 స్ట్రైక్ రేట్‌తో 419 పరుగులు చేయగా, డెత్ ఓవర్లలో 190 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. కానీ, టీ20 ప్రపంచకప్ 2022లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 40 పరుగులు మాత్రమే చేశాడు.
ప్రాబబుల్ ప్లేయింగ్ XI..
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
ఆస్ట్రేలియా: పాతుమ్ నిసంక, కుసల్ మెండిస్, ధనంజయ డి సిల్వా, చరిత్ అస్లంక, భానుక రాజపక్సే, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తేక్షణ, లహిరు కుమార, కసున్ రజిత
స్క్వాడ్‌లు:
శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, అషెన్ బండార, ప్రమోద్ మధుషన్, కసున్ రజిత జెఫ్రీ వాండర్సే
న్యూజిలాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(కీపర్), కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, మార్టిన్ గప్టిల్