T20 World Cup: ఆ రెండు జట్లు తలపడితే మజాయే వేరు.. రిటైర్మెంట్‌ తర్వాత ఆ మ్యాచ్‌ను లైవ్‌లో చూస్తా : ఆసీస్‌ కెప్టెన్‌

గత వారం టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ని టీవీలో చూశాను. అయితే రిటైర్మెంట్ తర్వాత ప్రత్యక్షంగా చూస్తా అని ఆస్ట్రేలియా కెప్టెన్ తెలిపాడు. అలాగే  కోహ్లీపై కూడా  ఫించ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

T20 World Cup: ఆ రెండు జట్లు తలపడితే మజాయే వేరు.. రిటైర్మెంట్‌ తర్వాత ఆ మ్యాచ్‌ను లైవ్‌లో చూస్తా : ఆసీస్‌ కెప్టెన్‌
Aaron Finch
Follow us
Basha Shek

|

Updated on: Oct 29, 2022 | 11:38 AM

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పెను సంచలనాలు నమోదవుతున్నాయి. బలమైన జట్లను మట్టికరిపిస్తూ పసికూనలు టోర్నీలో ముందడుగు వేస్తున్నాయి. వీటన్నింటి మధ్య, ఆతిథ్య ఆసీస్ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా ఇప్పటికే వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న అతను.. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే లైవ్ మ్యాచ్ చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నాడట. ‘భారత్-పాక్‌లు మైదానంలో తలపడతే ఆ మజాయే వేరు. స్టేడియంలో కూర్చుని ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను చూసే అవకాశం వస్తే అసలు వదులుకోను. గత వారం టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ని టీవీలో చూశాను. అయితే రిటైర్మెంట్ తర్వాత ప్రత్యక్షంగా చూస్తా అని ఆస్ట్రేలియా కెప్టెన్ తెలిపాడు. అలాగే  కోహ్లీని కూడా  ఫించ్ ప్రశంసించాడు. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అతను.. ఫలితం ఏమైనప్పటికీ.. భారత్‌, పాకిస్థాన్‌లు మంచి క్రికెట్‌ ఆడాయని ప్రశంసించాడు. అలాగే కోహ్లీ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యానన్నాడు. విరాట్ కోహ్లీ మాస్టర్ క్లాస్ బ్యాట్స్ మెన్, కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే ప్రత్యర్థి జట్టుపై ఎంత ఒత్తిడి ఉంటుందో ఈ మ్యాచ్ లో తెలిసిందని ఫించ్ చెప్పుకొచ్చాడు.

సెమీస్‌ అవకాశాలపై నీళ్లు..

కాగా డిపెండింగ్‌ ఛాంపియన్‌గా ఈ టోర్నీలోకి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. మొత్తం 3 పాయింట్లతో గ్రూప్‌2లో నాలుగో స్థానంలో ఉంది. కివీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీని తర్వాత శ్రీలంకతో జరిగిన తదుపరి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే 3వ గేమ్‌లో గెలిచి టోర్నీలో ఆధిక్యం సంపాదించాలనుకున్న ఆసీస్‌కు వరుణుడు విలన్‌గా మారాడు. ఇంగ్లండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. ఆస్ట్రేలియా సెమీస్‌ చేరుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్ ల్లోనూ ఆ జట్టు భారీ విజయం సాధించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..