Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS vs IRE: ఐర్లాండ్‌పై విజయంతో నంబర్ 2గా ఆస్ట్రేలియా.. గ్రూప్ 1 నుంచి సెమీస్ పోరులో ఆ 3 జట్లు..

ఈ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఇది రెండో విజయం కాగా, ఈ విజయం తర్వాత గ్రూప్-1లో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.

AUS vs IRE: ఐర్లాండ్‌పై విజయంతో నంబర్ 2గా ఆస్ట్రేలియా.. గ్రూప్ 1 నుంచి సెమీస్ పోరులో ఆ 3 జట్లు..
Aus Vs Ire
Follow us
Venkata Chari

|

Updated on: Oct 31, 2022 | 5:54 PM

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 దశలో ఆస్ట్రేలియా 42 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. బ్రిస్బేన్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 20 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ ఆటగాడు లోర్కాన్ టక్కర్ 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రెండో ఓవర్‌లో తొలి వికెట్‌ పడిన తర్వాత టక్కర్‌ చివరి వరకు నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్ల ముందు జట్టులోని మరే ఇతర బ్యాట్స్‌మెన్ నిలబడలేకపోయాడు. ఈ విజయంతో టీ20 ప్రపంచ కప్ 2022లో ఆస్ట్రేలియా గ్రూప్ 1లో 5 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. గ్రూప్ 1లో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది.

25 పరుగులకే 5 వికెట్లు..

ఐర్లాండ్ జట్టులో సగం మంది 25 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నారు. కానీ, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ లోర్కాన్ టక్కర్ చివరి వరకు బ్యాటింగ్ చేయడంతో ఐర్లాండ్ విజయంపై ఆశలు వచ్చాయి. 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కానీ, అవతలి ఎండ్ నుంచి సపోర్ట్ లేకపోవడంతో జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. అతను తప్ప ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్ ఎవరూ 15 పరుగులకు మించి స్కోర్ చేయలేకపోయారు.

ఆస్ట్రేలియా బౌలింగ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్ జంపా, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ తలో 2 వికెట్లు తీశారు. అదే సమయంలో మార్కస్ స్టోయినిస్‌కు ఒక వికెట్ దక్కింది. జట్టులోని చివరి బ్యాట్స్‌మెన్ రనౌట్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఐర్లాండ్ తరపున లోర్కాన్ టక్కర్ 71 పరుగులు చేయగా, గారెత్ డెలానీ 14, మార్క్ అడైర్ 11, పాల్ స్టిర్లింగ్ 11 పరుగులు చేశారు. ఆ జట్టులోని మరే ఇతర బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు.

దంచి కొట్టిన ఫించ్, మార్ష్, స్టోయినిస్..

అంతకుముందు ఆస్ట్రేలియా తరపున కెప్టెన్ ఆరోన్ ఫించ్ 44 బంతుల్లో 63 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. మార్కస్ స్టోయినిస్ 25 బంతుల్లో 35, మిచెల్ మార్ష్ 28 పరుగులు చేశారు. ఐర్లాండ్ తరఫున బ్యారీ మెక్‌కార్తీ 29 పరుగులిచ్చి 3 వికెట్లు, జాషువా లిటిల్ 21 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు.

ఇరు జట్ల ప్లేయింగ్ 11..

ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కీపర్), పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్.

ఐర్లాండ్ : పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ (కెప్టెన్), లోర్కాన్ టక్కర్ (కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాన్ఫెర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, ఫిన్ హ్యాండ్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్.