T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. కీలక మ్యాచ్‌కు దూరమైన స్టార్ ప్లేయర్?
Australia: అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ అఖరిలో ఫించ్ తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికీ బాధను భరిస్తూనే ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫించ్ ఫీల్డ్‌లోకి వచ్చినా.. బాధ మరింత ఎక్కువ కావడంతో 6వ ఓవర్‌లో బయటకు వచ్చేశాడు.
టీ20 ప్రపంచకప్‌లో అతిథ్య దేశానికి భారీ షాక్ తగలనుందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇదే నిజమైన ఆఫ్గానిస్తాన్‌తో కీలక మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన ఆ జట్టుకు.. గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లే. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ గాయం కారణంగా ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫించ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, విజయంతో కీలకపాత్ర పోషించాడు.
అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ అఖరిలో ఫించ్ తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికీ బాధను భరిస్తూనే ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫించ్ ఫీల్డ్‌లోకి వచ్చినా.. బాధ మరింత ఎక్కువ కావడంతో 6వ ఓవర్‌లో బయటకు వచ్చేశాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న ఫించ్.. 5 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 63 పరుగులు సాధించాడు.
అయితే, క్రికెట్ ఆస్ట్రేలియా ఈ టోర్నీకి వైస్ కెప్టెన్‌గా ఎవరిని ఎంచుకోకపోవడంతో.. ఫించ్ స్థానంలో కీపర్ మాథ్యూ వేడ్ తాత్కాలిక సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. ఇక తన గాయానికి సంబంధించిన అప్‌డేట్‌ను మ్యాచ్ అనంతరం ఫించ్ వెల్లడించాడు. ప్రస్తుతం చాలా నొప్పిగా ఉందని.. స్కాన్ రిపోర్ట్స్ బట్టి విశ్రాంతి తీసుకోవాలా వద్ద అన్నది ఆలోచిస్తానని ఫించ్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 42 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఇక నవంబర్ 4న ఆడిలైడ్ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది.