Team India: కివీస్, బంగ్లా టూర్‌లకు భారత్.. వారికి మొండిచేయి.. వీరికి విశ్రాంతి.. 5 కీలక విషయాలు ఇవే..

IND vs NZ, IND vs BAN: న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో మొత్తం 4 సిరీస్‌ల కోసం టీమిండియాను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్‌లకు కమాండింగ్ అందించింది.

Team India: కివీస్, బంగ్లా టూర్‌లకు భారత్.. వారికి మొండిచేయి.. వీరికి విశ్రాంతి.. 5 కీలక విషయాలు ఇవే..
Team India
Follow us

|

Updated on: Oct 31, 2022 | 8:02 PM

న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో మొత్తం 4 సిరీస్‌ల కోసం భారత జట్టును సోమవారం ప్రకటించారు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ 20 ప్రపంచకప్ తర్వాత టీమ్ ఇండియా న్యూజిలాండ్‌తో 3 టీ20, 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్‌తో 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. న్యూజిలాండ్‌తో జరిగే రెండు సిరీస్‌ల నుంచి భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, ఓపెనర్ కేఎల్ రాహుల్‌లకు విశ్రాంతినిచ్చారు. న్యూజిలాండ్‌తో జరిగే టీ20, శిఖర్ ధావన్ వన్డే జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడు. 4 టీమ్‌లలో చాలా మంది కొత్త ముఖాలు కూడా కనిపించబోతున్నాయి. కాగా, పృథ్వీ షా, హనుమ విహారి, రీతురాజ్ గైక్వాడ్ పేర్లు మాత్రం కనిపించలేదు. అలాగే టీ20 ప్రపంచ కప్‌లో చోటు దక్కించుకున్న దినేష్ కార్తీక్ మాత్రం ఈ 4 సిరీస్‌లకు ఎంపిక కాకపోవడం గమనార్హం.

దినేష్ కార్తీక్ మొండిచేయి..

ఐపీఎల్‌లో పటిష్ట ఆటతీరుతో టీ20 జట్టులోకి తిరిగి వచ్చిన దినేశ్ కార్తీక్‌ దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో అతను గాయపడినప్పటికీ, న్యూజిలాండ్ పర్యటనకు ఇంకా 17 రోజుల సమయం ఉంది. 15 మంది సభ్యుల జట్టులో అతని పేరు లేదు.

స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి..

ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ స్వదేశానికి తిరిగి రానున్నారు. ముగ్గురూ న్యూజిలాండ్ టూర్‌లో కనిపించరు. రోహిత్, కోహ్లి గైర్హాజరీలో పాండ్యా, ధావన్‌లు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. ముగ్గురు స్టార్లు బంగ్లాదేశ్ పర్యటనలో తిరిగి రానున్నారు. బంగ్లాదేశ్ టూర్‌కు రోహిత్ కెప్టెన్‌గా కనిపించనున్నాడు.

ఇవి కూడా చదవండి

దయాళ్‌కి తొలి ఛాన్స్..

ఐపీఎల్‌లో అద్భుతమైన ఆటతీరును కనబరిచినందుకుగానూ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్‌కు బహుమతి లభించడంతో పాటు తొలిసారి భారత జట్టులో అవకాశం లభించింది. బంగ్లాదేశ్‌తో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టులో అతను ఎంపికయ్యాడు. అదే సమయంలో గాయం కారణంగా ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లకు దూరమైన రవీంద్ర జడేజా బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌ నుంచి మళ్లీ మైదానంలోకి రానున్నాడు.

తిరిగి రానున్న చైనామాన్..

చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లో అవకాశం లభించింది. అదే సమయంలో, అతను బంగ్లాదేశ్‌తో జరిగే 2-టెస్టుల సిరీస్‌లో కూడా మైదానంలో కనిపించనున్నాడు. కాగా, కుల్దీప్ చివరిసారిగా ఫిబ్రవరి 2021లో ఇంగ్లండ్‌తో భారత్ తరపున టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

దేశవాళీ స్టార్‌లకు నో ఛాన్స్..

4 సిరీస్‌లకు బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది. కానీ, ఈ నాలుగు సిరీస్‌లలో ఎక్కడా రితురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, హనుమ విహారి పేర్లు కూడా కనిపించలేదు. కాగా దేశవాళీ టోర్నీలోనూ షా మంచి ప్రదర్శన చేశాడు. గత 10 మ్యాచ్‌ల్లో షా 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్ర తరపున గైక్వాడ్ కూడా ప్రకంపనలు సృష్టించాడు. గత 6 టీ20 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు చేశాడు.