T20 WORLD CUP: ధోని నేర్పిన వ్యూహాంతోనే సౌతాఫ్రికా గెలిచింది.. టీమిండియా మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో మూడు మ్యాచ్ లు ఆడిన భారత్ రెండు మ్యాచుల్లో గెలవగా, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఓటమి చవి చూసింది. టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ పై గెలుపుతో అందరి దృష్టిని ఆకర్షించిన భారత్.. సౌతాఫ్రికాపై..

T20 WORLD CUP: ధోని నేర్పిన వ్యూహాంతోనే సౌతాఫ్రికా గెలిచింది.. టీమిండియా మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Ms Dhoni, Ajay Jadeja
Follow us

|

Updated on: Nov 01, 2022 | 8:16 AM

టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో మూడు మ్యాచ్ లు ఆడిన భారత్ రెండు మ్యాచుల్లో గెలవగా, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఓటమి చవి చూసింది. టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ పై గెలుపుతో అందరి దృష్టిని ఆకర్షించిన భారత్.. సౌతాఫ్రికాపై ఓటమితో ఎంతో మందిని నిరాశపర్చింది. అయితే ఓ రకంగా సౌతాఫ్రికా పై ఓటమిని కొందరు అభిమానులు పాజిటివ్ గా తీసుకుంటుంటే.. మరికొంతమంది మాత్రం బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ పైనే టీమ్ ఆధారపడాల్సి వస్తోందని విమర్శిస్తున్నారు. అయితే భారత్ పై దక్షిణాఫ్రికా గెలుపు నేపధ్యంలో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ అజయ్‌ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు క్రికెట్‌ ప్రపంచానికి మహేంద్రసింగ్‌ ధోనీ నేర్పిన వ్యూహమే ఇప్పుడు భారత జట్టును చిక్కుల్లో పడేసిందని వ్యాఖ్యానించాడు. దాని ఫలితంగానే అక్టోబర్ 30వ తేదీ ఆదివారం సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్‌ మిల్లర్‌ వంటి ఆటగాళ్లు తెలివైన ప్రదర్శనతో టీమ్‌ఇండియాను ఓడించారని అన్నారు. ఈ వ్యాఖ్యలు సరదాగా చేసినప్పటికి.. దాని వెనుక లాజిక్ కూడా చెప్పాడు అజయ్ జడేజా.

దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ డేవిడ్‌ మిల్లర్‌ అద్భతంగా ఆడాడని ప్రశంసించాడు జడేజా. అతడి షాట్స్‌తో ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాడు. మైదానంలో ఉన్నంత సేపు చాలా ప్రశాంతంగా కనపడిన డేవిడ్‌ మిల్లర్ ప్రత్యర్థి చేతికి చిక్కే వరకు ఆటను ముందుకు తీసుకెళ్లాడు. నువ్వు తప్పు చేసే వరకు ఎదురుచూస్తాను. నేను మాత్రం తొందరపడి తప్పుచేయను.. అన్నట్లుగా అతడి ప్రదర్శన సాగిందని అజయ్ జడేజా పేర్కొన్నారు. నిజానికి ఇది క్రికెట్‌ ప్రపంచానికి ధోనీ నేర్పిన పాఠమే. దానిని ఒంటపట్టించుకుని తిరిగి మనల్నే దెబ్బకొట్టారు. చివరకు టీమ్‌ఇండియాను చిక్కుల్లోకి నెట్టారు అంటూ అజయ్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులు చేసింది. సఫారీ జట్టు 19.4 ఓవర్లలో 137 పరుగులు చేసి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాప్ ఆర్డర్ త్వరగా పెవిలియన్ చేరడంతో భారత్ జట్టు ఎక్కువ పరుగులు చేయలేకపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం చూడండి..