AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WORLD CUP: పాయింట్ల పట్టికలో భారత్ స్థానం ఇదే.. సెమీస్ అవకాశాలు ఆ జట్లకే..

టీ20 ప్రపంచకప్ లో తన మొదటి మ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై విజయంతో ప్రారంభించిన టీమిండియా మూడో మ్యాచ్ లో మాత్రం దక్షిణాఫ్రికాపై ఓటమి చవిచూసింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ జట్టు టీ20..

T20 WORLD CUP: పాయింట్ల పట్టికలో భారత్ స్థానం ఇదే.. సెమీస్ అవకాశాలు ఆ జట్లకే..
India Vs South Africa Play
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 31, 2022 | 11:11 AM

టీ20 ప్రపంచకప్ లో తన మొదటి మ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై విజయంతో ప్రారంభించిన టీమిండియా మూడో మ్యాచ్ లో మాత్రం దక్షిణాఫ్రికాపై ఓటమి చవిచూసింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ జట్టు టీ20 ప్రపంచకప్‌లో తొలి ఓటమిని ఆదివారం చవిచూసింది. తక్కువ స్కోరింగ్ మ్యాచ్ లో ప్రత్యర్థి సఫారీ జట్టు టీమిండియాపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. పెర్త్‌లో భారత్‌పై 134 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా విజయవంతంగా ఛేదించింది. ఈచేధనలో డేవిడ్ మిల్లర్ 46 బంతుల్లో 59 పరుగులతో అర్థ శతకం పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. దక్షిణాఫ్రికా జట్టు మ్యాచ్ గెలవడంతో కూడా మిల్లర్ కీ రోల్ పోషించాడు. మార్క్ రామ్ కూడా 41 బంతుల్లో 52 పరుగులు చేశాడు. దీంతో సఫారీ జట్టు విజయం సాధించింది. భారత బ్యాటింగ్ విషయానికొస్తే సూర్య కుమార్ యాదవ్ ఒంటరి పోరాడం చేశాడనే చెప్పుకోవాలి. సూర్య కుమార్ యాదవ్ 40 బంతుల్లో 68 పరుగులు చేయడంతో భారత్ 9 వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులు చేసింది.

టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ లో సఫారీ జట్టు గెలుపుతో పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు జరిగాయి. గ్రూప్ బిలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. భారత్ పై గెలుపుతో దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో మొదటిస్థానంలో నిలిచింది. జింబాబ్వేతో జరిగిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లకు చెరో పాయింట్ లభించింది. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలుపొందిన దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో గ్రూప్ బిలో మొదటిస్థానానికి చేరుకుంది.

మరోవైపు భారత్‌ ఆడిన మూడు మ్యాచుల్లో రెండు గెలవడంతో నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఉన్నాయి. బంగ్లాదేశ్ కూడా భారత్ తో సమానంగా నాలుగు పాయింట్లు కలిగి ఉన్నప్పటికి రన్ రేట్ కారణంగా బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది. జింబాబ్వే మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, రెండు పాయింట్లతో పాకిస్తాన్ ఐదో స్థానంలో ఉన్నాయి. గ్రూప్ బి నుంచి దక్షిణాఫ్రికా, టీమిండియా సెమీస్ చేరుకునే అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏవైనా అద్భుతాలు జరగకపోతే మాత్రం ఈ రెండు జట్లకు సెమీస్ అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరికొన్ని క్రీడా వార్తల కోసం చూడండి..