Methi Leaves Benefits: మెంతికూరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఆహారంలో ఇలా చేర్చుకోండి..
ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది. అనేక రకాల ఆకుకూరల్లో మెంతికూర ఒకటి. దీనిని ఒక ఔషధంగా కూడా పరిగణిస్తారు. మెంతులను సువాసనా ద్రవ్యంగా, మసాలా దినుసులలో ఒకటిగా ఉపయోగిస్తాము. మెంతికూరలో అతి విలువైన..
ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది. అనేక రకాల ఆకుకూరల్లో మెంతికూర ఒకటి. దీనిని ఒక ఔషధంగా కూడా పరిగణిస్తారు. మెంతులను సువాసనా ద్రవ్యంగా, మసాలా దినుసులలో ఒకటిగా ఉపయోగిస్తాము. మెంతికూరలో అతి విలువైన పోషకాలు కూడా ఉంటాయి. మెంతికూరను అధికంగా ఆహారంలో కూడా ఉపయోగిస్తారు. వీటిలో పోషకాలు ఎక్కువ. పెరటిలో పెంచటం తేలిక. విత్తనాలు చల్లిన కొద్దీ రోజులలో మొక్కల ఆకులను మనం ఆహారంగా వాడుకోవచ్చు. ఇక పచ్చటి మెంతికూర ఆకు ఎంతో రుచికరంగాను, ఔషధ విలువలు కలిగి ఉంటుంది. ఈ ఆకులను ఎండబెట్టి కొన్ని ఆహార పదార్థాలలో వాడుకోవచ్చు.ఎండిన ఆకుల సైతం ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మెంతి ఆకులను చలికాలంలో తప్పనిసరిగా తినాలి. మెంతికూర తినడం వల్ల నడుము నొప్పి వంటి బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. మహిళలకు రుతుస్రావం సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది మెంతుకూర. ముఖ్యంగా మెంతి ఆకులను రెగ్యులర్ గా తినడం వల్ల లివర్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గ్యాస్, పేగుల్లో ఏర్పడే సమస్యలు తొలగిస్తుంది. శ్వాస కోసం వ్యాధుల్ని తగ్గిస్తుంది.
మెంతులలో కావలసినంత పీచు పదార్థాలు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. దీంతోపాటు విటమిన్ – సి, బి1, బి2, కాల్షియం, విటమిన్ – కె, కూడా ఉంటాయి. ఈ ఆకులను ఎండబెట్టి కొన్ని ఆహార పదార్థాలలో వాడకోవచ్చు. ఎండిన ఆకులు సైతం ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో జీర్ణ సమస్యలు సహజంగానే వస్తుంటాయి. మెంతి ఆకులను నిత్యం తీసుకుంటే షుగర్ వ్యాధి నియంత్రణకు మంచి ఫలితాలనిస్తుంది. మెంతిలో ప్రోటీన్లు, నికోటినిక్ యాసిడ్ కూడా ఉంటాయి. ఇవి వెంట్రుకల చక్కటి ఎదుగుదలకు తోడ్పడతాయి. శీతాకాలంలో మనం తీసుకునే ఆహారంలో మెంతి కూర లేదా మెంతి ఆకులను వివిధ మార్గాల ద్వారా చేర్చుకోవచ్చు. చలికాలం వచ్చిందంటే చాలు తాజా మెంతి ఆకులు మార్కెట్‌లో లభివస్తాయి. ఎండిన మెంతి ఆకులు, మెంతి గింజలను మన కూరల్లో, మనం తినే ఆహార పదార్థాల్లో జోడించుకుంటే ఆరోగ్యానికి మంచిది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి , మధుమేహాన్ని నియంత్రించడానికి ఆయుర్వేదంలో వీటిని ఔషధంగా ఉపయోగిస్తారు. మెంతికూరను పప్పుతో కలిసి వంటకంగా చేసుకోవచ్చు. అలాగే పరోటా లేదా ఇతర కూరల్లో కూడా చేర్చుకోవచ్చు. మెంతి కూర వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
గుండె సంబంధిత సమస్యలకు చికిత్స
గెలాక్టోమన్నన్ ఉండటం వల్ల, మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మెంతులు కీలక పాత్ర పోషిస్తాయి. ఇది అధిక మొత్తంలో పొటాషియంను కలిగి ఉంటుంది, రక్తపోటును నియంత్రించడానికి మెంతుఆకులో ఉండే పదార్థాలు సమాయపడతాయి.
యాంటీ డయాబెటిక్
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా మెంతి ఆకులు సహాయపడతాయి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి బాధ్యత వహించే అమైనో ఆమ్లాలను కూడా కలిగి ఉంటుంది.
ఎముకలు ధృఢంగా
మెంతు కూర తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యం ధృఢంగా ఉంటుంది. మెంతి ఆకులు విటమిన్ కె యొక్క అద్భుతమైన మూలాలు. ఎముకలో ఆస్టియో-ట్రోఫిక్ చర్యను ప్రోత్సహించడం ద్వారా ఎముక ద్రవ్యరాశిని బలోపేతం చేయడంలో విటమిన్ కె ముఖ్య పాత్రను కలిగి ఉంటుంది.
ఆహారంలో ఎలా జోడించాలి
సలాడ్ : మెంతి ఆకులను తక్కువ నూనెలో కొద్దిగా ఉల్లిపాయతో కలిపి వేయించాలి. తరిగిన టమోటాలు, నిమ్మకాయలు, కొంత బెల్లం, మసాలా దినుసులు జోడించి సలాడ్ గా చేసుకోవచ్చు.
సూప్ : మెంతులు సూప్ తాగడం శీతాకాలంలో ఆరోగ్యకరం. తాజా మెంతి ఆకులు, టమోటాలు, ఉల్లిపాయలు, దంచిన మిరియాలు తో మెంతి ఆకుల సూప్ తయారు చేసుకోవచ్చు.
పరోటా: తాజా మెంతి ఆకులను గోధుమ పిండిలో చేర్చి పరాఠాలను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..