- Telugu News Photo Gallery Cricket photos India vs new zealand rohit sharma virat kohli rest after t20 world cup in new zealand series
Team India: టీమిండియా పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యా.. ఎప్పటినుంచంటే?
ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో బిజీగా ఉన్న టీమిండియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లేందుకు పోరాడుతోంది. ఇంతలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి ఓ వార్త బయటకు వచ్చింది.
Updated on: Oct 31, 2022 | 7:31 PM

టీమ్ ఇండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో బిజీగా ఉంది. ఈలోగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి కోరినట్లు భారత శిబిరం నుంచి వార్తలు వస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్ తర్వాత 3 టీ20ఐ, 3 వన్డేల సిరీస్ కోసం టీమ్ ఇండియా న్యూజిలాండ్‌కు బయలుదేరుతుంది. ఈ పర్యటనలో రోహిత్, కోహ్లీ కనిపించరని వార్తలు వచ్చాయి.

మీడియా కథనాల ప్రకారం, న్యూజిలాండ్ టూర్‌లో ఇద్దరికీ విశ్రాంతి ఇస్తే, హార్దిక్ పాండ్యా లేదా కేఎల్ రాహుల్ కెప్టెన్సీని పొందవచ్చని భావిస్తున్నారు.

నవంబర్ 18 నుంచి న్యూజిలాండ్‌లో భారత పర్యటన ప్రారంభం కానుంది. తొలుత 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత 3 వన్డేల సిరీస్ ఆడనుంది.

రోహిత్, కోహ్లి గురించి మాట్లాడితే, గత కొంతకాలంగా వీరిద్దరు నిరంతరాయంగా ఆడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రోహిత్ దాదాపు 26 అంతర్జాతీయ టీ20లు, 6 వన్డేలు ఆడాడు. దీంతో పాటు ఐపీఎల్ కూడా ఆడాడు. రోహిత్ విరామం లేకుండా నిరంతరం ఆడుతున్నాడు.





























