- Telugu News Photo Gallery Cricket photos Hyderabad player vvs laxman birthday special kolkata innings records against australia on this day in cricket
Team India: కోల్‌కతాలో కంగారూలకు దడ పుట్టించాడు.. ఇప్పటికీ అదే ‘వెరీ వెరీ స్పెషల్’ అంటోన్న హైదరాబాదీ..
భారత్ తరపున 134 టెస్టులు, 86 వన్డేలు ఆడాడు. లక్ష్మణ్ పేరిట 8 వేల 781 టెస్టు పరుగులు, 2 వేల 338 వన్డే పరుగులు ఉన్నాయి.
Updated on: Nov 01, 2022 | 12:29 PM

క్రికెట్ ప్రపంచంలో వెరీ వెరీ స్పెషల్‌గా పేరుగాంచిన వీవీఎస్ లక్ష్మణ్ ఈరోజు తన 47వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. 1974 నవంబర్ 1న హైదరాబాద్‌లో జన్మించిన లక్ష్మణ్.. భారత్ తరపున 134 టెస్టులు, 86 వన్డేలు ఆడాడు. లక్ష్మణ్ పేరిట 8 వేల 781 టెస్టు పరుగులు, 2 వేల 338 వన్డే పరుగులు ఉన్నాయి.

తన కెరీర్‌లో ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ హైదరాబాదీ సొగసరి ప్లేయర్.. ఆస్ట్రేలియా జట్టుకు పట్టపగలే చుక్కలు చూపించిన ఆ స్పెషల్ ఇన్నింగ్స్‌ను ఎవరూ మరిచిపోలేరు. కోల్‌కతాలో లక్ష్మణ్ మ్యాజిక్ చూసి ఆస్ట్రేలియా కూడా విస్మయానికి గురైంది. ఈ మ్యాచ్ తర్వాత వీవీఎస్ చాలా స్పెషల్‌గా మారిపోయాడు.

ఈ ఇన్నింగ్స్ చూసి ముగ్ధుడైన ఆస్ట్రేలియన్ కెప్టెన్ లక్ష్మణ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. 2001లో కోల్‌కతా మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో లక్ష్మణ్ 281 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఈ ఇన్నింగ్స్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచింది.

కోల్‌కతాలో లక్ష్మణ్ ఇన్నింగ్స్ ఆధారంగానే స్టీవ్ వా నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు విజయ ప్రయాణాన్ని భారత్ నిలిపివేసింది. కోల్‌కతాలో దిగడానికి ముందు, ఆస్ట్రేలియా వరుసగా 16 టెస్టుల్లో విజయం సాధించింది. కోల్‌కతాలో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. ప్రతిస్పందనగా భారత ఇన్నింగ్స్ 171 పరుగులకు కుదించింది. ఫాలోఆన్ ఆడుతున్న భారత్ 232 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత లక్ష్మణ్‌కు రాహుల్ ద్రవిడ్ మద్దతుగా నిలిచాడు. వీరిద్దరూ ఒకటిన్నర రోజుల పాటు మైదానంలో నిలవడంతో భారత్ 7 వికెట్లకు 657 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా విధించిన 384 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది.

ఆ తర్వాత, భారత బౌలర్లు అద్భుతాలు చేసి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 212 పరుగులకు కట్టడి చేసి, 171 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకున్నారు. దీని తర్వాత స్టీవ్ వా మాట్లాడుతూ, వీవీఎస్ అంటే చాలా ప్రత్యేకమైనవాడు. ఎందుకంటే అతను చాలా ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఆడాడు.




