Cricket: ఇలా గుడ్‌న్యూస్.. అలా బ్యాట్‌తో చితక్కొట్టుడు.. 11 ఫోర్లు, 9 సిక్సర్లతో ఊచకోత..
ఇలా బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్‌లకు ఎంపికైనట్లు వార్త వచ్చిందో లేదో.. అలా బౌలర్లపై విధ్వంసం సృష్టించాడు. సెంచరీతో తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించిన గిల్ 55 బంతుల్లో 11 ఫోర్లు, 9 సిక్సర్లతో 129 పరుగులు సాధించాడు. 49 బంతుల్లోనే శతకొట్టాడు. ఇలా బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్‌లకు ఎంపికైనట్లు వార్త వచ్చిందో లేదో.. అలా బౌలర్లపై విధ్వంసం సృష్టించాడు. సెంచరీతో తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. గిల్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 225 పరుగులు చేసింది. అతడితో పాటు మరో బ్యాటర్ అన్మోల్‌ప్రీత్ సింగ్(59) రాణించాడు. అననతరం 226 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 216 పరుగులకు పరిమితమైంది. తద్వారా పంజాబ్ 9 పరుగుల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది. ఇక కర్ణాటక బ్యాటర్లలో అభినవ్ మనోహర్(62), మనీష్ పాండే(45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో రామన్‌దీప్ సింగ్ రెండు వికెట్లతో చెలరేగగా.. అశ్వని కుమార్, బల్తెజ్ సింగ్, సిద్దార్థ్ కౌల్ చెరో వికెట్ తీశారు.
The crisis man under pressure, Shubman Gill. pic.twitter.com/QYgkNkplcr
— Johns. (@CricCrazyJohns) November 1, 2022