Afghanistan vs Sri Lanka: సెమీస్ రేసులో శ్రీలంక.. ఓటమితో టోర్నీ నుంచి తప్పుకున్న ఆఫ్ఘానిస్తాన్..
ఆఫ్ఘనిస్థాన్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి సెమీస్‌లో తన స్థానాన్ని కాపాడుకుంది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేరుకుంది.
గబ్బా వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు ఘన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్థాన్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి సెమీస్‌లో తన స్థానాన్ని కాపాడుకుంది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేరుకుంది. ధనంజయ్ డి సిల్వా 66 పరుగులతో కీలక ఇన్నింగ్ ఆడి జట్టును విజయపథంలో నడింపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. కేవలం 42 బంతుల్లో 157 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టాడు. కుశాల్ మెండీస్ 25 పరుగులు, అసలంక 19, రాజపక్సా 18 పరగులు చేశారు. ఆఫ్ఘాన్ బౌలర్లలో ముజీబ్ 2, రషీద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ ఓటమితో ఆఫ్ఘనిస్తాన్ జట్టు టీ20 ప్రపంచకప్ టోర్నీ నుంచే తప్పుకుంది.
అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఇందులో రహ్మానుల్లా గుర్బాజ్ అత్యధికంగా 28 పరుగులు చేశాడు. శ్రీలంక తరపున వనిందు హసరంగా 13 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. లహిరు కుమార రెండు వికెట్లు తీశాడు. పవర్ ప్లేలో ఆఫ్ఘనిస్థాన్ వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. అనంతరం లంక బౌలింగ్ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోతూ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది.
View this post on Instagram
రెండు జట్ల ప్లేయింగ్ XI..
ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, ఉస్మాన్ ఘని, గుల్బాదిన్ నాయబ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహమాన్, ఫరీద్ అహ్మద్ మరియు ఫజల్హాక్ ఫరూకీ.
శ్రీలంక: పాతుమ్ నిసంక, కుసల్ మెండిస్, ధనంజయ డి సిల్వా, చరిత్ అస్లంక, భానుక రాజపక్సే, దసున్ షనక (కెప్టెన్), వనిందు హస్రంగ, ప్రమోద్ మదుషన్, మహేష్ టెక్క్షణ, లహిరు కుమార, కసున్ రజిత